అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరూ కూడా క్రెడిట్ కార్డుని బాగా ఉపయోగిస్తూ సులువుగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ జరగడం వల్ల క్రెడిట్ కార్డుని వినియోగించేవారు మూడు నెలల వరకు కార్డు బిల్లుని చెల్లించడం అక్కర్లేదుట.

 

మే 31 దాకా ఈ బెనిఫిట్ ని ఉపయోగించుకోవచ్చట. కానీ వడ్డీ భారం ఏమైనా ఉంటుందా..? అన్న ప్రశ్నకి వస్తే తప్పక ఉంటుందనే అంటున్నారు. కరోనా వల్ల ప్రభుత్వమే  కాదు      ఆర్ బీ ఐ  కూడా పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే దీనిలో ప్రధానమైనది ఈఎంఐ మారటోరియం అని అన్నారు.

 

ఈఎంఐ మారటోరియం ఆప్షన్ ని కనుక ఎవరైనా ఎంచుకుంటే వారు  మే 31  తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ కానీ ఔట్‌ స్టాండింగ్ మొత్తాన్ని కూడా  చెల్లించక తప్పదు . ఇవి మాత్రమే చెల్లిస్తే సరిపోదు వీటితో పాటుగా పడే  వడ్డీ చార్జీలు కూడా తప్పక కట్టాలని చెప్పింది.

 

బ్యాలెన్స్ చెల్లిస్తే కూడా  కార్డు జారీ చేసిన సంస్థలు లేట్ పేమెంట్ చార్జీలు కలెక్ట్  చెయ్యవట. అలానే సుమారు రూ.800 చెల్లించాలిట. దీని వల్ల వారి  క్రెడిట్ స్కోర్ కూడా తగ్గి పోతుంది. జారీ సంస్థలు క్రెడిట్ బ్యూరో సంస్థలకు ఈ సమాచారాన్ని తెలియజేయవు. అలాగే కొన్ని బ్యాంకులు లేట్ పేమెంట్ చార్జీలను కూడా వసూలు చేయమని ప్రకటించాయన్న సంగతి కూడా తెలిసినదే .

 

అయితే ఈ క్రెడిట్ కార్డులు బాధలు పడే కంటే కూడా డబ్బు ఉంటే చెల్లించడమే మంచిది. ఎందు కంటే ఆఖరిలో వడ్డీ బాగా ఎక్కువ పడిపోతుంది. కాబట్టి మంచి పని ఏమిటి అంటే సకాలంలో చెల్లించడమే. అందుకే వడ్డీ బారిన పడకుండా డబ్బు కట్టేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: