ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుంది. అన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ వైరస్. దీన్ని కట్టడి చేయడానికి గానూ అన్ని దేశాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయినా సరే కరోనా మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి కనపడటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇప్పుడు అత్యంత వేగంగా పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు కరోనా దెబ్బకు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. 

 

అగ్ర రాజ్యం అమెరికా, ఇటలీ, జర్మని, ఫ్రాన్స్, బెల్జియం, స్పెయిన్ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పుడు 12 లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా 1,120,059 మందికి కరోనా సోకింది. ఇక మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. 60 వేలకు దగ్గరలో ఉన్నాయి. అమెరికాలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. నిన్న ఒక్క రోజే 1500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇక ఇటలీ లో మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. 14 వేలు దాటాయి. స్పెయిన్ లో 10 వేలు దాటాయి. జర్మని లో కూడా దాదాపుగా అదే స్థాయిలో ఉన్నాయి. జర్మనీలో కేసులు లక్ష దగ్గరలో ఉన్నా మరణాలు మాత్రం తక్కువే ఉన్నాయి. ఇక బెల్జియం లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మన దేశంలో కరోనా కేసులు సంఖ్య 3100 దాటింది. ఇవి గంట గంటకు పెరుగుతున్నాయి. 70 మంది కరోనా కారణంగా మరణించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 180 మందికి కరోనా సోకగా తెలంగాణాలో 229 మందికి కరోనా సోకింది.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: