ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. దేశంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో అలాంటి ప్రయోగం ఒకటి జరిగింది. రాష్ట్రంలో తిర్పూర్ జిల్లాలో అధికారులు కరోనా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ ను ఏర్పాటు చేశారు. 
 
5 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవుతో నిర్మించిన ఈ టన్నెల్ కు రెండు సెట్ల స్ప్రేయర్లను అమర్చారు. రెండు సెట్లకు ఆరు నాజిల్స్ ఉంటాయి. ఈ నాజిల్స్ ద్వారా కరోనా వైరస్ ను నాశనం చేసే సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని మనుషులపై పిచికారీ చేస్తున్నారు. మార్కెట్ దగ్గర అధికారులు ఈ టన్నెల్ ను ఏర్పాటు చేశారు. మార్కెట్ కు వచ్చేవారు మొదట వాష్ బేసిన్ల దగ్గర సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఆ తరువాత రెండు చేతులు పైకెత్తి టన్నెల్ గుండా నడుచుకుంటూ వెళ్లాలి. 
 
అలా వెళ్లే వారిపై ఐదు సెకన్ల పాటు హైపోక్లోరైట్‌ ద్రావణం నాజిల్స్ ద్వారా పిచికారీ చేస్తారు. భారతీయ పరిశ్రమల సమాఖ్యకు చెందిన యంగ్ ఇండియన్స్ విభాగం ఈ టన్నెల్ తయారీకి సహాయసహకారాలు అందించినట్లు తెలుస్తోంది. టన్నెల్ తయరీకి దాదాపు 90,000 రూపాయలు ఖర్చయ్యాయని సమాచారం. రోజుకు 16 గంటలు టన్నెల్ ద్వారా పిచికారీ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. 
 
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో మరికొన్ని జిల్లాల్లో టన్నెల్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఇతర సంస్థలు వీటిని స్పాన్సర్ చేయడానికి ముందు వస్తున్నాయని తెలుస్తోంది. తమిళనాడులో ప్రయోగం విజయవంతమైందని వార్తలు రావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా టన్నెల్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: