దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. భారత ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటకు రాకూడదు అని కరోనా వైరస్ ను దేశం నుంచి తరిమి కొట్టేందుకు తమకు సహకరించాలని అంటూ కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. అన్ని రంగాలు స్వచ్ఛందంగా కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు మద్దతు తెలుపుతూ పూర్తిగా మూసివేశారు. ఈ క్రమంలోనే భారతీయ చిత్ర పరిశ్రమ కూడా పూర్తిగా షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే. అన్ని సినిమా షూటింగులు ఆగిపోయి ప్రస్తుతం స్టార్స్ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. 

 

 

 ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇంట్లోనే ఉంటూ ఏదో విధంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో వాళ్ళు  ఏం చేస్తున్నారు  అనే దానిపై కూడా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటున్నారు  సెలబ్రిటీలు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ కూడా లాక్ డౌన్  సమయంలో తనకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది . ప్రాణాంతకమైన కరోనా  వైరస్ మహమ్మారి కారణంగా... ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రతి మనిషిలో కొంత మార్పులు తీసుకొస్తున్నాయి అంటూ జాన్వికపూర్ అన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో తాను ఎంతగానో నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. 

 

 

 లాక్ టౌన్ సమయంలో తాను నేర్చుకున్న విషయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది జాన్వికపూర్. లాక్ డౌన్ నాకు ఎన్నో విషయాలను. రోజు మనం తింటున్న ఆహారం విలువ ఏంటో తెలిసొచ్చింది. ఎంతోమంది లాక్ డౌన్  సమయంలో తిండిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని రోజుల వరకు నేను వారి గురించి ఆలోచించలేదు అంటే నేను ఎంత స్వార్ధపరురాలినో నాకు  అర్థమైంది అంటూ  జాన్వికపూర్ కాస్త ఎమోషనల్ అయ్యింది. ఈ రోజు నా జీవితం సాఫీగా సాగిపోవడానికి ఎంతమంది నాకోసం కష్టపడుతున్నారో  అర్థం అయింది. ఇక మా ఇంటికి నేను ఎంత అవసరం అన్న విషయం కూడా తెలిసొచ్చింది. నేను ఎంత బాధ్యతగా మెలగాలి అన్న విషయం పూర్తిగా అర్థమైంది అంటూ బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వికపూర్ సోషల్ మీడియా వేదికగా తన మనసులో మాటను అభిమానులతో పంచుకుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: