దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎంతో మంది ఇప్పటికే ఈ మహమ్మారి  బారినపడి మరణిస్తే ఇంకెంతో మంది కనిపించని మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. దేశం మొత్తం మృత్యువును దరి చేరకుండా ఉండేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ పై  పోరాటం చేసేందుకు...  దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ వైరస్కు సరైన మందు లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో... కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవగాహన చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే అటు  సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం ఊపందుకుంటుంది.

 

 

 ప్రజలందరినీ భయబ్రాంతులకు గురి చేసేలా... అయోమయంలో పడవేసే విదంగా  సోషల్ మీడియాలో వింత ప్రచారాలు జరుగుతున్నాయి. ఎన్నో పుకార్లు నకిలీ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని సాప్దర్ గంజ్  హాస్పిటల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్ కు చెందిన అన్ని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లా  వివరాలను... ఢిల్లీ పోలీసులకు సమర్పించనున్నట్లు సబ్దర్ గంజ్  హాస్పిటల్ యాజమాన్యం  ప్రకటన చేసింది. వాట్సాప్ గ్రూప్ లో అడ్మిన్ ల పేర్లు... మొబైల్ ఫోన్ నెంబర్లు... వారివారి ఇమెయిల్ అడ్రస్ లు సహా తదితర వివరాలను కూడా ఢిల్లీ పోలీసులకు అందించనున్నట్లు సర్కార్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. 

 

 

 ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అయోమయంలో పడేసేలా  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, పుకార్లు వార్తలకు చెక్ పెట్టేందుకు... తమ వంతు కృషిగా పోలీసులకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్  వివరాలను ఇస్తున్నట్లుగా ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో రోజు రోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలుసిందే . అయితే రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎన్నో ముందస్తు జాగ్రత్తగా చేపట్టింది. ఇప్పటివరకు ఢిల్లీలో 386 కరుణ కేసులు నమోదవగా... వీరిలో 250 మంది మార్కజ్  నిజాముద్దీన్ సమావేశానికి వెళ్లిన వారే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: