ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తూ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది మహమ్మారి కరోనా వైరస్. ప్రపంచాన్ని మొత్తం ఒక్కసారిగా కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ మొహమ్మరి  బారినపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా ఇంకా ఎంతోమంది మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా  వైరస్ ను  జయించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే కరోనా  వైరస్ ప్రభావం  ప్రపంచదేశాల్లో రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే కరోనా  వైరస్ ప్రభావం ఉన్న అన్ని దేశాలు... తమ తమ దేశంలో నిర్బంధం ప్రకటించుకుని ప్రజలెవరూ బయటకు రాకుండా కేవలం ఇంటికే పరిమితం అయ్యేలా చేస్తున్నాయి. 

 

 

 అయితే ఆయా దేశాల ప్రభుత్వాలకు కరోనా వైరస్ ను నియంత్రించడం ఎంత కష్టతరంగా మారిందో..  మృతి చెందిన వారి అంత్యక్రియలు జరపడం కూడా అంతే కష్టతరంగా మారింది. అయితే వివిధ మతాలకు చెందిన వారు మరణించినప్పుడు వారి అంత్యక్రియలు ఎలా జరగాలి అన్న దానిపై ప్రస్తుత ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా శ్రీలంక లో ఇలాంటి ఘటన జరిగింది. కరోనా  వైరస్ కారణంగా శ్రీలంకలో ఓ ముస్లిం వ్యక్తి మృతి చెందాడు. ఈ క్రమంలోనే సదరు ముస్లిం వ్యక్తి మృతదేహాన్ని దహనం చేశారు అధికారులు. 

 

 

 అయితే ముస్లిం వ్యక్తి మృతదేహాన్ని దహనం చేసిన నేపథ్యంలో మైనారిటీ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక్కడి ఉన్నతాధికారులు అందరూ ఇస్లాం సూచించిన సంప్రదాయానికి అడ్డుపడుతున్నారు  అంటూ ఆరోపణలు చేస్తున్నారు ముస్లిం సోదరులు. కొలంబోలో 73 ఏళ్ల బిశ్రాబ్ హాపీ  మహమ్మద్ కరోనా  వైరస్ కారణంగా మరణించగా అతనికి దహన సంస్కారాలు నిర్వహించారు అధికారులు. కానీ  ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం  దహన సంస్కారాలు నిర్వహించకుండా మృతదేహాన్ని ఖననం చేస్తారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారుల తీరును తప్పుబడుతూ మీడియాతో మాట్లాడిన మృతి కొడుకు ... తన తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇక రెండు వారాల క్రితమే కరోనా  వచ్చినదని  చికిత్స పొందుతూ  ఏప్రిల్ 1వ తేదీన మరణించాడని. తన తండ్రి మృతదేహాన్ని పోలీసులు బలగాలు పర్యవేక్షణలో తీసుకెళ్లి దహనం చేశారు అంటూ ఆరోపించాడు. దూరంగా తాము నిలబడి తండ్రి శాంతి కోసం ప్రార్థించాను అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: