ఏ ముహూర్తంలో దేశంలో కరోనా అడుగు పెట్టిందో కానీ.. కేరళా, మహరాష్ట్ర పై బీభత్సమైన ప్రభావం చూపిస్తుంది. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న మహారాష్ట్రలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం నాటికి 537కు చేరినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా గత 12 గంటల్లో కొత్తగా 355 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,902కు చేరుకుందని పేర్కొంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,650 కాగా, 184 మందికి వ్యాధి నయం కాడం లేదా వారిని డిశ్చార్చ్ చేయడం జరిగింది.

 

కాగా, తాజా లెక్కల ప్రకారం కరోనా మృతుల సంఖ్య 68కి చేరింది. కరోనా వైరస్‌తో ధారవీలో చనిపోయిన వ్యక్తికి ఢిల్లీ తబ్లీగ్ జమాత్ మత సమ్మేళనానికి హాజరైన వ్యక్తి నుంచి వైరస్ సోకినట్టు గుర్తించారు. మార్చి 22న మర్కజ్ జమాత్ ప్రార్ధనలకు వెళ్లొచ్చిన ఐదుగురు మహిళలు ఈయన ఫ్లాట్‌లో ఉన్నారని, మృతుడితో కాంటాక్ట్ అయ్యారని అధికారులు తెలిపారు.  శుక్రవారం పుణే, జలగావ్‌లో ఒక్కొక్కరు చొప్పున చనిపోవారు.   

 

 

గత నాలుగు రోజులుగా మహారాష్ట్రంలో కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన 47 కేసుల్లో 28 కేసులు ముంబై నుంచి, థానే జిల్లా నుంచి 15, పుణె, అమ్రావతి, పింప్రి చించ్వాడ్ నుంచి ఒక్కో కేసు ఉంది. కోవిడ్-19 ప్రభావం మహారాష్ట్రపై ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ప్రకటించింది. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: