తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా  వైరస్ కబళిస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ కరోనా వైరస్ ను మాత్రం కట్టడి చేయలేక పోతుంది. ప్రతిరోజు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్  కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 229 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్యతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 

 

 

 అయితే కరోనా వైరస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో తొందరగా చనిపోతుందని... ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్న వేళ  వాతావరణ శాఖ కీలక ప్రకటన  వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో హైదరాబాదులో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు తో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్ సహా పలు నగరాలలో పూర్తిగా మేఘాలు కమ్ముకుని వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

 

 

 అయితే ఇప్పుడిప్పుడే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని వైరస్ ప్రభావం తగ్గుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు  తెలంగాణ ప్రజలు. అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం పూర్తిగా పరిస్థితులు మారిపోయే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎక్కువగా చల్లగా ఉన్న ప్రాంతాల్లో కరోనా  వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా  వైరస్ రోజురోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వర్షాలు పడితే ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పంటలు  కూడా దాదాపుగా చేతికి రావడంతో వర్షాలు పడితే రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: