ఏపీలో ప్రతిరోజూ కరోనా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోను కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేయగా కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొన్ని రోజుల క్రితం కర్నూలులో ఒక కేసు నమోదు కాగా ఈరోజు మూడు కేసులు నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 4కు చేరింది. 
 
ఈరోజు నమోదైన మూడు కేసులకు ఢిల్లీ మత ప్రార్థనలకు సంబంధం ఉన్నట్లు కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. కరోనా పాజిటివ్ బాధితులు కర్నూలు జిల్లా రోజా వీధి, బనగానపల్లె, అవుకు ప్రాంతాలకు చెందిన వారని సమాచారం. ఈ ప్రాంతాల ప్రజలు కేసులు నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు కరోనా నిర్ధారణ అయిన వారిని మార్చి 31న క్వారంటైన్ లో చేర్చారు. ఈ నెల 1వ తేదీన వీరిలో కరోనా సంబంధిత లక్షణాలు కనిపించటంతో వైద్యులు నమూనాలను అనంతపురం ల్యాబ్ కు పంపారు. 
 
అక్కడ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మరోసారి నమూనాలను సేకరించి తిరుపతి ల్యాబ్ కు పంపగా అక్కడ కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. కలెక్టర్ జిల్లా నుంచి 449 శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపించామని తెలిపారు. వీరిలో ఢిల్లీ జమాత్ కు హాజరైన 338 మంది నమూనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకూ 90 రిపోర్టులు రాగా ఈరోజు ఢిల్లీ జమాత్ కు వెళ్లినవారిలో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు. 
 
కలెక్టర్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో నిత్యావసరాలకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతాలంతా క్రిమి సంహారక రసాయనాలతో స్ప్రే చేయిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.... సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే 9441300005 కు లేదా 104 కు కాల్ చేసి కరోనా పై ఏవైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చని కలెక్టర్ సూచించారు. ఎవరైనా సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: