దేశంలో కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్రాలు ఎంతగా కృషి చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే లాక్ డౌన్ చేసిన విషయం విషయం తెలిసిందే.  ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజల కష్ట సుఖాల గురించి తెలుసుకుంటూ.. వారికి మనో ధైర్యాన్ని నింపుతున్నారు.  మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి సందేశాలు ఇస్తూనే ఉన్నారు.  రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి దీపం, లాంతరు లేదా మొబైల్ ఫోన్లతో లైట్స్ ఆన్ చేసి సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఢిల్లీలో జరిగిన తబ్లిగ్‌ జమాత్‌ కార్యక్రమానికి  హాజరై వచ్చిన వారికి ఈ కరోనా పాజిటీవ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.  

 

ఎంత జాగ్రత్తలు చెప్పినా కొంత మంది నిర్లక్ష్యం వల్ల ఈ వైరస్ విస్తరిస్తుంది.  మరోవైపు కొంత మంది మత పెద్దలు కొంత మంది సాముహాన్ని ఏర్పాటు చేసుకొని బోధనలు చేస్తున్నారని.. ఇది ఎంత ప్రమోదమో చెప్పినా వారి పంధా మార్చుకోవడం లేదని అంటున్నారు. తాజాగా ఏపీ ప్రజలు, మతపెద్దలకు గవర్నర్‌ హరిచందన్‌ ఓ విజ్ఞప్తి చేశారు. మతపరమైన సమావేశాలు నిర్వహించవద్దని.. కరోనా వైరస్‌ మానవాళికి పెద్ద ప్రమాదంగా పరిణమించిందని గవర్నర్ కోరారు. ప్రభుత్వాలు జారీ చేసిన హెల్త్‌ ప్రోటోకాల్‌ను పాటించాలన్నారు.

 

గవర్నర్‌ వైద్య సిబ్బందికి అందరూ సహకరించాలన్నారు. క్వారంటైన్‌లో ఉన్న తబ్లిగ్‌ జమాత్‌ సభ్యులు తమపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నారన్న నర్సుల ఆరోపణలు నిజమేనని ఘజియాబాద్‌ పోలీసులు తేల్చారు. గవర్నర్‌ వైద్య సిబ్బందికి అందరూ సహకరించాలన్నారు. కరోనా సోకిన వారిని ఐసోలేషన్‌కు పంపుతున్న సిబ్బంది పట్ల.. అమర్యాదగా ప్రవర్తించడం సమంజసం కాదని గవర్నర్‌ తెలిపారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: