ఆ మద్య ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మహేష్ బాబు మీ కోసం అక్కడ ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే.. మీరిక్కడ ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారి అంటాడు.  నిజమే ఇప్పుడు దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  కరోనాని పూర్తిగా అరికట్టేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలు తప్ప అన్ని మూసివేస్తున్నారు.  ఇలాంటి సమయంలో బాధ్యతగల పౌరులుగా మన చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించాల్సింది పోయి.. కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన తబ్లిగ్‌ జమాత్‌ కార్యక్రమానికి  హాజరై వచ్చిన వారికి ఈ కరోనా పాజిటీవ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.  

 

ఎంత జాగ్రత్తలు చెప్పినా కొంత మంది నిర్లక్ష్యం వల్ల ఈ వైరస్ విస్తరిస్తుంది.  ఏపి, తెలంగాణ నుంచి కూడా కొంత మంది వెళ్లిన విషయం తెలిసిందే. రోనా వ్యాప్తికి కారణమైన జనగామ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అడ్మిన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అధికారి గుట్టుగా తన విధులకు హాజరవుతూ వస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం గమనించి కూడా యథావిధిగా విధులకు హాజరైనట్లు స్పష్టం చేశారు.

 

ఈ నెల 21, 23, 27 తేదీల్లో విధులకు హాజరై అధికారులు, సిబ్బందితో సన్నిహితంగా మెలిగి, తన నిర్లక్ష్యాన్ని నిరూపించుకున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి ఇతనిపై ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 269, 270 (ఇతరులకు ప్రాణ హాని తలపెట్టే విధంగా ప్రవర్తించడం, సెక్షన్ 188 కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.  దిల్లీకి వెళ్లి మత ప్రార్థనల్లో పాల్గొని వైరస్‌ను ఇక్కడ వ్యాప్తి చెందేందుకు పరోక్షంగా ప్రయత్నించిన అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: