దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్న కారణంగా సామాన్య ప్రజలు, కూలీలు, వలస కూలీలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం ఇదొక్కటే మార్గం గా కనిపించడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేస్తున్నాయి. ఏప్రిల్ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తరువాత దీనిని వారీగా తొలగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ వ్యవహారంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చిన నివేదిక తీవ్ర కలకలం రేపుతోంది.

 

IHG
 జూన్ నెలాఖరు వరకు భారత్ లో  కొనసాగించాలంటూ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తమ నివేదికలో పేర్కొనడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ ను మరి కొంత కాలం పాటు పొడిగిస్తారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ ను పొడిగించే ది లేదు అంటూ తేల్చి చెప్పింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇటీవల ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ముఖ్యమంత్రులు అంతా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు.


 కేంద్రం సహాయం చేయకపోతే పరిస్థితి చేయి దాటి పోతుంది అని, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తి వేయాలని కేంద్రం ఆలోచనలో ఉండగా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక బయటకు రావడం కలకలం రేగుతోంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మే చివరి వరకు లేదా, జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తే నే మంచిది అన్నట్లుగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తమ నివేదికలో పేర్కొంది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: