కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచంలో పరిస్థితులన్నీ ఒక్కసారిగా తలకిందులు అయిపోయాయి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ ఆర్థిక మూలాలు చిన్నాభిన్నం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా వైరస్ దెబ్బకి ఆర్థికంగా చాలా వరకు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ ఉన్న రేట్లు కూడా పడిపోయాయి. ఎప్పుడైతే కరోనా వైరస్ చైనాలో ఎంటర్ అయ్యిందో అప్పటినుండి అని దేశాల స్టాక్ మార్కెట్లలో తేడా గట్టిగా కనబడింది. ఇండియా లో కూడా...ఫిబ్రవరి మాసం నుండి స్టాక్ మార్కెట్ చాలావరకు కుప్పకూలే స్టేజ్ లోనే ఉంది. రోజురోజుకీ కొన్ని లక్షల కోట్లు నష్టపోతూ నే వస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి స్టాక్ మార్కెట్ 24 శాతం సంపదను కోల్పోయింది. లెక్కల్లో చూసుకుంటే 38 లక్షల కోట్లు ఇండియాలో నష్టపోవడం జరిగింది.

 

అయితే ఎక్కువగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినవారికి నష్టం వచ్చింది. భారీ లాభాలతో… తన స్టాక్ వాల్యూను అంతకంతకూ పెంచుకుంటూ పోయి.. బిలియనీర్లుగా మారిపోయిన వారు.. కరోనా వైరస్ దెబ్బకు రేంజ్‌నుతగ్గించుకోవాల్సి వచ్చింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదట పడాలంటే రెండు మూడు సంవత్సరాల టైం పడుతుంది అంటూ ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి అన్ని దేశాలలో ఉండటంతో స్టాక్ మార్కెట్ తిరిగి పునరుద్ధరించడం చాలా కష్టమని...స్టాక్ మార్కెట్ ఇంకా కోలుకునే పరిస్థితి లేదని మరి కొంతమంది అంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టాక్ మార్కెట్ లు అన్నీ పడిపోవడంతో, సరికొత్త కరెన్సీ తో మరియు ప్రపంచాన్ని మొత్తంగా ఆర్థిక వ్యవస్థ వస్తేగానీ మళ్లీ స్టాక్ మార్కెట్ పుంజుకునే అవకాశం లేదని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: