క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేవాను క‌మ్మేసి.. ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్ర‌మంలోనే కంటికి క‌నిపించ‌డ‌ని శ‌త్రువు.. ఆయుధం లేకుండా ప్ర‌పంచ‌దేశాలు యుద్ధం చేస్తున్నాయి. అయితే సమకాలీన ప్రపంచంలో శక్తిమంతులయిన నాయకులకు కొదవేమీ లేదు. అయితే వారిలో ఏ ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తిని ఎందుకు అరికట్ట లేకపోతున్నారు? అయిన‌ప్ప‌టికీ త‌మ పోరాటాన్ని మాత్రం ఆప‌డం లేదు. వెన‌క‌డుగు వేయ‌డం లేదు. ఇక ఇప్ప‌టికే  ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10లక్షల 98వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మ‌రియు 59వేల 140మందికి పైగా కరోనాతో చనిపోయారు. 

 

ఈ సంఖ్య గంట‌గంట‌కూ పెరిగిపోతోంది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌ సోకి మరణించిన వారి మృత దేహానికి అంత్యక్రియలు ఎలా చేస్తారు?, శవాన్ని కుటుంబ సభ్యులకు చూపిస్తారా.. ఇలాంటి ఎన్నో సందేహాలున్నాయి చాలా మందిలో ఉన్నాయి. రోనా సోకి మరణించేవారి అంత్యక్రియలు వేరుగా ఉంటాయి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను వెల్ల‌డించింది.

 

ఓ వ్యాక్తి క‌రోనా వైర‌స్‌తో మృతి చెందితే శవ పరీక్షలు నిర్వహించకూడదు. డెడ్ బాడీని ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్ బ్యాగు లో ఉంచాలి. బ్యాగ్ వెలుపలి భాగాన్ని ఒక శాతం హైపో క్లోరైట్ తో క్లీన్‌ చేయాలి. అలాగే డెడ్ బాడీని తరలించే వాహనాన్ని ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి. ఇక ఈ డెడ్ బాడీ బ్యాగ్ ముఖం వరకూ తెరచి ఉంచాలి. చివరి చూపు కుటుంబ సభ్యులకు చూసే అవకాశం ఇవ్వవచ్చు… కాని వారు మృతదేహాన్ని ముట్టుకోకూడదు, స్నానం కూడా చేయించకూడదు. అలాగే మృతదేహాన్ని ఎంబామింగ్ కు అనుతించరాదు. ఇవే కేంద్ర ప్రభుత్వం క‌రోనా మృత‌దేహాల‌కు రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాలు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: