ప్రధాని నరేంద్ర ప్రకటించిన దీపాల కార్యక్రమంపై ఇప్పుడు పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుంది. ప్రధాన మంత్రి వైద్య పరికరాల మీద దృష్టి పెట్టకుండా కొవ్వొత్తులు వెలిగించాలి అని చెప్పడంపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సాంప్రదాయాలను లింక్ పెట్టి కొందరు మాట్లాడుతున్నారు. దాని వలన దేశానికి వచ్చే ప్రయోజనం ఏంటో మోడీ సర్కార్ చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పుడు మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయితే బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

 

దీని వలన కలిగే ప్రయోజనం ఏంటో చెప్పాలి అన్నట్టు ఆమె మాట్లాడుతున్నారు. మోడీ నమ్మకం మోడీది నా నమ్మకం నాది అని మోడీ ని నమ్మిన వారు నమ్మండి, నన్ను నమ్మే వారు నన్ను నమ్మండి అంటూ ఆమె ప్రకటన చేసారు. కరోనా వైరస్ విషయంలో చాలా రాష్ట్రాల కంటే బెంగాల్ చాలా బెటర్ అంటున్నారు మమతా... తాను చేసే కార్యక్రమాలను ఆమె వివరిస్తున్నారు. మమత ప్రజల్లోకి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ప్రజల్లోకి వెళ్లి సూచనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వీడియో లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 

 

ఈ చర్యలను అందరూ సమర్ధిస్తున్నారు. మోడీ మాత్రం ప్రజల్లోకి వెళ్ళడం లేదు. మమతా బెనర్జీ కేవలం భద్రతా సిబ్బందిని పరిమితంగా చేస్తూ ఆకస్మిక పర్యటనలు చేస్తూ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో లు వైరల్ కావడం తో ఆమెను అందరూ ప్రసంశిస్తున్నారు. మమత తరహాలో మోడీ చెయ్యాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది కొవ్వొత్తులు కాదని ధైర్యం కావాలని అది మమత ఇస్తున్నారని బిజెపి నేతలు పనికిరాని విమర్శలు చేయడం దాదాపుగా ఆపితే మంచిది అంటూ సూచనలు చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: