కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు పోలీసులు ఎక్కువగా భయపడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇన్నాళ్ళు ధైర్యంగా ఉన్న పోలీసులు ఇప్పుడు మాత్రం తీవ్రత పెరిగే సరికి కంగారు పడుతున్నారు. వాళ్ళు ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సి ఉంది. కాని వాళ్ళు మాత్రం ఇప్పుడు కంగారు పడుతున్నారు. ప్రాణాలకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తారు. ముంబై విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి కరోనా వైరస్ రావడం తో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా మంది పోలీసులు ఇప్పుడు విధులకు వచ్చే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

కుటుంబ సభ్యులు కూడా వారి విషయంలో భయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వారిని అందరూ ప్రసంశిస్తున్నా వారి భద్రత విషయంలో మాత్రం ఎవరు ఏ సలహాలు ఇవ్వడం లేదు. ముంబై విమానాశ్రయంలో దాదాపు 20 మంది భద్రతా సిబ్బందికి కరోనా వైరస్ రావడం తో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీని మీద వెంటనే అప్రమత్తం కాకపోతే మాత్రం పరిస్థితులు ఇబ్బంది పెడతాయని అంటున్నారు. వైద్యులు, పోలీసులు ఈ విషయంలో చాలా కీలకమని అంటున్నారు.

 

వాళ్ళు ఏ మాత్రం వెనక్కు తగ్గినా సరే కరోనా వైరస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. పోలీసు లు లేకపోతే లాక్ డౌన్ ఇంత విజయవంతం అయ్యేది కాదు అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. లాక్ డౌన్ ని అమలు చేసే విషయం లో వాళ్ళు చేసే కొన్ని కొన్ని పనులు ప్రజలను భయపెడుతున్నాయి. అందుకే ప్రజలు బయటకు రావడం లేదు. చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్లకు ప్రభుత్వాలు ధైర్యం ఇవ్వాలని వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక వాళ్ల భద్రతకు అవసరం అయ్యే వస్తువులను అందిస్తే మంచిది అనే సూచనలు ప్రభుత్వాలకు వెళ్తున్నాయి.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: