మన ప్రభుత్వాలు కరోనా వైరస్ పై పోరాటం చేసే విషయంలో వైద్యుల భద్రతను పట్టించుకోవడం లేదా...? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినపడుతుంది. పోలీసులు వైద్యుల భద్రత అనేది చాలా ప్రాధాన్యత అంశం అని అంటున్నారు చాలా మంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వైద్యులకు కరోనా వైరస్ సోకుతుంది. వాళ్ళు ఏ మాత్రం వెనక్కు తగ్గినా సరే కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. మన దేశంలో వైద్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

వైద్యులకు ఇవ్వాల్సిన ఏ పరికరం కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. వాళ్ళు బండి నడిపే సమయంలో పెట్టుకునే హెల్మెట్, రైన్ కోట్స్ పెట్టుకుని వైద్యం చేస్తున్నారని... అలాంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారని కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని వారి భద్రతకు భారీగా ఖర్చు పెట్టకపోతే మాత్రం రాబోయే రెండు వారాల్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళ భద్రత విషయంలో గనుక దృష్టి పెట్టకపోతే ఇబ్బంది పడటం అనేది ఖాయం. ఇప్పుడు వాళ్ళ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టాలి. 

 

వాళ్లకు అవసరమైన సామాగ్రిని అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఆర్ధిక శాఖ భారీగా నిధులు ఇవ్వాలి. లేకపోతే పరిస్థితి మరింత ప్రమాధకరమవుతుంది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి కీలక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చెయ్యాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలు అన్నీ కూడా వైద్యుల భద్రత విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి అని సూచనలు ఇస్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 300 మంది వైద్యులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అందుకే వైద్యుల భద్రత విషయంలో ఇంత ఆందోళన.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: