కరోనా వైరస్ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ దెబ్బకు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్ కి చికిత్స చేయడం అనేది కూడా వైద్యులకు కూడా ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ని అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని మరింతగా పొడిగించే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు రైల్వే శాఖ కు రైళ్ళను నడపాలా లేదా అనేది అర్ధం కావడం లేదు. 

 

రైలు నడపాలి అంటే జిల్లా సరిహద్దులను రాష్ట్రాల సరిహద్దులను తెరిచినట్టే అవుతుంది. రైలు వెళ్తే జనాలు ఎక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రైలు నడిపితే కరోనా వైరస్ ని స్వాగాతించినట్టే. కాబట్టి ఇప్పుడు రైల్వే శాఖ ఈ విషయంలో తీవ్ర కసరత్తులు చేస్తుంది. దీన్ని ఏ విధంగా డీల్ చెయ్యాలో అర్ధం కావడం లేదు కేంద్ర రైల్వే శాఖకు. రైళ్ళు ఇంకొన్నాళ్ళు ఆగితే మాత్రం భారీగా నష్టం వస్తుంది. ఇప్పటికే రైల్వే శాఖ నష్టాల్లో ఉంది అంటున్నారు. అప్పుడు ఈ నష్టాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. 

 

రైలు నడిపితే కరోనా దేశ వ్యాప్తంగా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. మరి దీని విషయంలో కేంద్రం, రైల్వే శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అర్ధం కావడం లేదు. కేంద్రం దీని విషయంలో అవసరం అయితే కేబినేట్ సమావేశం కూడా నిర్వహించి నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయని అంటున్నారు. మన దేశంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి రైల్వే శాఖ ఒకటికి పది సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: