అందరిలో అగ్రగామి అయిన అమెరికాలో కరోనా.. విలయ తాండవం చేస్తోంది. అమెరికా వ్యాప్తంగా గాని చూసుకుంటే... ఇప్పటివరకు 277522 కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణాల సంఖ్య 11744కి చేరుకుంది.. కాగా... 34219 మంది కరోనా బారినుండి బయట పడినట్లు తెలుస్తోంది. అధికంగా న్యూయార్క్ లో 93,097 కేసులు నమోదు కాగా...  2,587 మరణాలు సంభవించినట్లు సమాచారం.

 

ప్రస్తుత పరిస్థితుల రీత్యా... న్యూయార్క్ నగరంలో వైద్య రంగం పూర్తిగా కుదేలు మంటోంది. అక్కడ శవాలు   పూడ్చేందుకు ప్లేసులు లేక, దాదాపు 200 డెడ్ బాడీలు మార్చురిల్లోనే మగ్గుతున్నాయట. ఇకపోతే.. కరోనా పుణ్యమాని అమెరికాలో మునుపెన్నడూ లేనంతగా గడిచిన రెండు మూడు వారాల్లో ఒక కోటికి పైనే ఉద్యోగాలు కోల్పోయినట్లు ఆంగ్ల మీడియాలు పేర్కొన్నాయి. ఇక నిత్యావసర సరుకులకూ తీవ్ర కొరత ఏర్పడుతోంది.

 

ప్రస్తుత దుస్థితికి ట్రంప్ కారణమంటూ వివిధ ఆంగ్ల మీడియాలు పేర్కొంటున్నాయి. ఆయనకు ముందు జాగ్రత్త ఉంటే ఇలాంటి ఘోరాలు సంభవించేయి కావని కొందరి ఆరోపణ. ఇక అయన లేటుగా స్పందిస్తూ... విజ్రంభిస్తున్న కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాలి అంటూ... అమెరికా పౌరుల్ని తమ తమ ఇండ్లలోనే ఉండాలి అంటూ... ఏప్రిల్ 30 వరకు, సోషల్ డిస్టెన్సింగ్ గైడ్ లైన్స్ ను పాటించాలి అని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా గాని చూసుకుంటే.... 
 

ప్రపంచలో మొత్తం కేసులు: 11, 33, 375
మరణాలు: 60, 380
రికవరీ కేసులు: 2, 36, 000

 

ఇండియాలో మొత్తం కేసులు: 3082 
మరణాలు: 86 
కొత్త కేసులు: 23
రికవరీ కేసులు: 229 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 229
యాక్టివ్ కేసులు: 186 
కొత్త కేసులు: 75
మృతులు: 11 
కోలుకున్నవారు: 32 

 

ఏపీలో మొత్తం కేసులు: 180 
కొత్త కేసులు: 16
మృతులు: 2 

 

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
నెల్లూరు: 32
కృష్ణా: 27
గుంటూరు: 23
కడప: 23
ప్రకాశం: 18 
పశ్చిమ గోదావరి: 15
విశాఖపట్నం: 15
తూర్పు గోదావరి: 11  
చిత్తూరు: 10 
కర్నూలు: 4 
అనంతపురం: 2

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: