మోడీ ఆరేళ్ళ ప్రధాని, అనేక యుద్ధాల్లో ఆరితేరిన వారే కాదు, అవలీలగా అనేక అద్భుత విజయాలను సొంతం చేసుకున్న రాజకీయ చాణక్యుడు. గిట్టని వారు అద్రుష్టవంతుడంటారు, అయితేనేమీ మోడీ కత్తికి ఇప్పటివరకూ ఎదురులేకుండా పోయింది. ప్రతీ సవాల్ ని విజయ‌ సోపానంగా మార్చుకుంటున్న మోడీ మాస్టార్ ముందు ఎందరు కుప్పిగంతులేసినా కూడా బలాదూరే మరి.

 

మోడీ గ్రాఫ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. చూస్తూండగానే ఆయన మరో  మారు ప్రపంచ నాయకుడు అయిపోయారు. ఎలాగంటే అమెరికా, ఫ్రాన్స్,  స్పెయిన్, ఇటలీ తదితర అభివ్రుధ్ధి చెందిన దేశాల్లో  కరోనా మంటలు పెడుతూంటే భారత్ లో మాత్రం డబుల్ డిజిట్ లోనే మరణాల రేటుని ఉంచిన మోడీ ఘనుడేనని లోకం వేనోళ్ళ కితాబు ఇస్తోంది.

 

సరే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటూ మోడీని చూసి నేర్చుకోండంటూ యూరోపియన్ దేశాలకు సలహాలు ఇస్తోంది. ఇవన్నీ వింటున్న దేశంలోకి ప్రతిపక్షాలకు నోట మాట రావడంలేదు. ఎన్నార్సీ ద్వారా మోడీ వ్యతిరేక గాలి కొంతైనా పోగు చేసామని ప్రతిపక్షం అనుకుంటున్న వేళ కరోనా వైరస్ దేశంలో దూరింది. 

 

దీంతో మోడీ ఏంచేస్తారో అని అంతా చూస్తున్న వేళ మోడీ జనతా కర్యూ అనేశారు. దానికి దేశం మొత్తం అనుకూలంగా రియాక్ట్ అయింది. ఆ తరువాత రెండు రోజులు ఆగి 21 రోజుల లాక్ డౌన్ అని మోడీ ధైర్యంగా అనేశారు. దానికి కూడా జనం జై కొట్టేశారు. ఇపుడు ఏప్రిల్ 5న దీపాలు వెలిగించాలను మోడీ అంటున్నారు. దీనికి కూడా దేశం తయారుగానే  ఉంది.

 

సరిగ్గా  ఇక్కడే విపక్షానికి మండిపోతోంది. మోడీ 130 కోట్ల మంది మనసు పట్టేసి తన వైపునకు తిప్పేసుకుంటున్నారు. ఒక్కరైనా వ్యతిరేకంగా లేరు. దాంతోనే విపక్షం మండిపోతోంది. మోడీవి మాయా మశ్చీంద్ర  మ్యాజిక్కులంటూ మజ్లీస్ నేత ఓవైసీ ఘాటుగా రెస్పాండ్ అయితే ఇపుడు మమతా బెనర్జీ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ వరసలో కాంగ్రెస్ చిదంబరాలు వగైరాలూ ఉన్నారు.

 

 ఎవరెన్ని అంటున్నా మోడీ మాట భారత  జనం వింటోంది. ఆయన నమ్మకమైన నాయకుడిగా ఉన్నారు. కరోనా మీద ఆయన చేయాల్సింది చేస్తున్నారు. ఫలితం చూడాలి. ఏది ఏమైనా మోడీ మోకాలడ్డేందుకు విపక్షం కరోనాను మరచి విష రాజకీయానికి దిగాలనుకోవడమే దేశానికి పట్టిన  అసలైన దరిద్రమనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: