తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా ప్రభావం విపరీతంగా చూపిస్తుంది. ముఖ్యంగా ఏపిలో దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఏపిలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేవల 12 గంటల వ్యవధిలో 16 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 180 కి చేరింది. కాగా కొత్తగా నమోదయిన కేసులలో ఎక్కువగా జమాత్‌కు వెళ్లి వచ్చిన వారె ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా జమాత్‌కు వెళ్లి వస్తే వారందరూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  తాజాగా ఆంధ్ర ప్రదేశ్ జగన్ సర్కారుకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

 

గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీని కరోనా దెబ్బకు కష్టాల్లో ఉన్నామని, కేంద్ర ఆదుకోవాలని కోరారు.  ప్రస్తుతం ఏపిలో కోరాన పరిస్థితి వల్ల ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్ల పరిస్థితిలో ఉందని ఆయన చెప్పారు.   రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి రాష్ట్రానికి రూ.1,050.91 కోట్లను రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్‌ కింద విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నెలకు ఈ నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  

 

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం ఏప్రిల్‌ నెలకు రూ.6,157.74 కోట్లు, అన్ని రాష్ట్రాలకు విపత్తుల సహాయ నిధి కింద అడ్వాన్స్‌గా తొలి విడతగా రూ.11,092 కోట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లను సిఫార్సు చేసింది. కాగా రూ.491.41 కోట్లను ఏప్రిల్‌ నెలకు విడుదల చేసింది.  ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ వద్ద సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి కి వెంటనే స్పందన రావడం.. కష్టకాలంలో ఆదుకోవడం మంచి విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: