తెలంగాణాలో కరోనా తన సత్తా చాటుతున్న సమయంలో ఇక్కడ ప్రతి వారిని అనుమానించవలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయి ఎవరు ఆరోగ్యవంతుడో, ఎవరు కరోనాను వెంటపెట్టుకుని తిరుగుతున్నారో అర్ధం కావడం లేదు.. అంతే కాదు.. ఈ మహమ్మారి ఎవరి రూపంలో వచ్చి కాటు వేస్తుందో అర్ధం కావడం లేదు.. ఇప్పుడు అయిన వారు, కానీ వారంటూ ఏ భేధం లేదు.. ఒకే ఇంటిలో నివసిస్తున్న వారు తప్ప ప్రస్తుతం అందరు కానీ వారే.. బంధువులు, స్నేహితులు, ఇంటి చుట్టుపక్కలి వారు అని అందరితో కలిసిపోయే పరిస్దితులు కానరావడం లేదు కరోనా తగ్గే దాకా అందరు అనుమానితులే..

 

 

ఇకపోతే కరోనా.. వైద్యం చేసే డాక్టర్లను కూడా వదలడం లేదు.. సామాన్యులను ఏం వదులుతుంది.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఇప్పటికే ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఇదిలా ఉండగా తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం మండ్రలో ఉన్న హైస్కూల్‌లో విధులు నిర్వహించిన టీచర్‌కు కరోనా రావడంతో ముందస్తుగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే తమ పిల్లలు చదువుతున్న స్కూలు ఉపాధ్యాయుడికి కరోనా అని తేలడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.. ఇప్పటికే కరోనా కేసులు నల్గొండ జిల్లాలో మొత్తం 9కి పెరిగాయి. అదీగాక నార్కట్‌పల్లి మసీదులో మయన్మార్‌కు చెందిన 17 మంది వ్యక్తులు ప్రార్థనలు చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని, పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది..

 

 

ఇక శుక్రవారం నమోదైన 75 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా 229 కి చేరింది. కాగా ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే 147 కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు ప్రతి గంటకు కరోనా కేసులు నమోదు కావడం వైద్య ఆరోగ్య శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది... ఇక ఒక వారం కిందటి వరకు ఊపిరి పీల్చుకున్న రెండు రాష్ట్రాల ప్రజలను ఇప్పుడు అకస్మాత్తుగా పెరుగుతున్న కరోనా కేసులు స్దిమితంగా ఉండకుండా చేస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: