దేశంలో కరోనా ని అరికట్టేందుకు ఎన్నో విధాలు గా ప్రయత్నాలు చేస్తున్నారు.  దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కొంత మంది నిర్లక్ష్యం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇక   ఢిల్లీలో జరిగిన తబ్లిగ్‌ జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వచ్చిన వారికి  ఈ కరోనా పాజిటీవ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఏడు గంటల్లోనే ఏపిలో 10 కేసులు నమోదు అయ్యాయి.

 

  నిన్న రాత్రి 10.30 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల మధ్య కొత్తగా 16 కేసులు నమోదయి ఆ సమయానికి మొత్తం కేసులు 180కి చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నమోదైన కరోనా కేసుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190 కి పెరిగిందని ప్రభుత్వం వివరించింది.

 

ఓ వైపు కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ఏపిలో సీఎం జగన్ ప్రతి క్షణం అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా, నెల్లూరులో అత్యధికంగా 32 కేసుల చొప్పున నమోదయ్యాయి.కృష్ణా జిల్లాలో కొత్తగా 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: