ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కారమయ్యేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో పంటల రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు, మార్కెటింగ్ శాఖ ఇచ్చే ఉత్తర్వులు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించింది. 
 
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీలో పండ్లు, పూలు, కూరగాయలు, మిర్చి, పసుపు రైతులకు ప్రయోజనం కలగనుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ నుంచి కూరగాయలు, నిత్యావసర వస్తువులకు మినహాయింపు ఇచ్చింది. అయినప్పటికీ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. 
 
ప్రభుత్వం గతంలో ఉద్యానవన పంటల రవాణాకు, ఎగుమతులకు అనుమతి ఇచ్చినా ఆ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం మరోసారి జిల్లా కలెక్టర్లను ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రైతుల సమస్యలకు పరిష్కారం లభించినట్లే అని చెప్పవచ్చు. మరోవైపు రాష్గ్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈరోజు వీడియో సందేశం ఇచ్చారు. 
 
జగన్ మాట్లాడుతూ మర్కజ్ సమావేశానికి హాజరైన వారికి కరోనా సోకడం దురదృష్టకరమని అన్నారు. ఇలా వైరస్ సోకడాన్ని అనుకోకుండా జరిగిన ఘటనగానే భావించాల్సి ఉంటుందని చెప్పారు. కంటికి కనిపించని వైరస్ పై మనం పోరాటం చేయాలని సూచించారు. వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించనున్నామని... ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాన్ని రెండు విడతలుగా చెల్లించనున్నామని తెలిపారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: