లాక్ డౌన్ ఇపుడు పదమూడో రోజు నడుస్తోంది. జనమంతా తెగ విసుగెత్తి ఉన్నారు. ఎపుడు ఎత్తేస్తారా వీధుల్లోకి పోదామాని ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 14 వరకూ ఆగండని మోడీ మాస్టార్ చెప్పుకొస్తున్నారు. అలాగే తెలుగు ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్ కూడా చెబుతున్నారు. సరేనంటూ రోజులు లెక్కబెడుతున్నారు.

 

అయితే మొత్తానికి మొత్తం 130 కోట్ల మంది జనాలకు నెత్తిన పిడుగులాంటి వార్త ఇపుడు ఒకటి వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్న వార్త ఏంటంటే లాక్ డౌన్ 21 రోజులు కాదుట. ఏకంగా అయిదు నెలల పాటు ఉంటుందని. నిజంగా ఇది నిజమా అంటే నమ్మలేము కానీ ఇపుడు దేశంలో వెల్లువలా పెరుగుతున్న కరోనా కేసులు, అరకొర వైద్య సదుపాయాలు ఇలాంటి పరిస్థితుల్లో జనాలను కనుక రోడ్ల మీదకు వదిలేస్తే ఇండియాలో మరణాలు ఎన్ని ఉంటాయో  కూడా ఎవరికీ ఊహకందని విషయమే.

 

దాంతో మోడీ మదిలో ఏముందన్నది పక్కన పెడితే కచ్చితంగా ఏప్రిల్ 14 మాత్రం లాక్ డౌన్ ఎత్తేయరు అని మాత్రం అంతా చెబుతున్నారు. ఇపుడు బీసీజీ నివేదిక ఒకటి కేంద్రం చేతుల్లో ఉందని అంటున్నారు. ఆ నివేదికలో దేశంలో అసలు పరిస్థితి బాగులేదని, కరోనా ఇపుడు చాలా దారుణంగా ఉందని, ఈ సమయంలో లాక్ డౌన్ మరి కొన్నాళ్ళు  కొనసాగించడమే మంచిదని సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

 

మొత్తం భారతదేశంలో కరోనా కేసులు జీరో స్థాయికి వచ్చేంతవరకూ కూడా లాక్ డౌన్ తప్పని సరి అని కూడా అందులో సూచించినట్లుగా తెలుస్తోంది. అదంతా ఇపుడు అయ్యే పనేనా అనిపిస్తోంది. నిజానికి లాక్ డౌన్ పీరియడ్ లోనే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వీటి సంగతి చూడాలి. ఆ తరువాత ఇళ్ళలో ఉన్న అనుమానితులను కూడా చెక్ చేయించాలి. మొత్తానికి ఇదొక కరోనా సర్పయాగం. అది ముగియాలంటే వరసగా లాక్ డౌన్ సమయం పెంచుకుంటూ పోవాల్సిందేనని అంటున్నారు.

 

తొందరగా లాక్ డౌన్ ఎత్తేయడం అంటే జూన్ 6వ తేదీ అంటున్నారు. ఒకవేళ అప్పటికి కూడా కుదరకపోతే మరి కొన్నాళ్ళు పట్టవచ్చు అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మార్చి తో మొదలెట్టి జూన్, జూలై వరకూ లాక్ డౌన్ ని తీసుకుపోతారా అన్న డౌట్లు అందరిలో ఉన్నాయి. అయితే లాక్ డౌన్ ఒకేసారి అన్ని నెలలు విధించకుండా మధ్యలో కొన్ని రోజులు కండిషన్లతో కూడిన రిలాక్సేషన్ ఇచ్చి మళ్ళీ పొడిగిస్తారని అంటున్నారు. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: