తాజాగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ... ఢిల్లీ లోని కరోనా బాధితులలో 11 మంది ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారని... ఇద్దరు వెంటిలేటర్స్ పై ఉన్నారని... మిగతావారి పరిస్థితి అంతా నిలకడగా ఉందని తెలిపారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 445 కేసులు నమోదు కాగా అందులో 40 కేసులు లోకల్ ట్రాన్స్మిషన్ కాగా... కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసులు నమోదు కాలేదని ఆయన అన్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ ఈరోజు పదివేల మంది పేద వాళ్లకు ఆహారం అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈరోజు 6 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 22కు చేరుకుంది. తబ్లీజీ జమాత్ వేడుకల్లో పాల్గొన్న 355 మంది ని క్వారంటైన్ లో ఉంచామని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు 144 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4 మరణాలు సంభవించడం... 14 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హర్యానా రాష్ట్రంలో కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 48 చేరుకోగా... మరో 14 మంది కరోనా పీడితులు రికవర్ అయ్యారు.


కేరళ రాష్ట్రంలోని కాసర్గోడ్ జిల్లాలో మొట్టమొదటిగా కోవిడ్ 19 వ్యాధి సోకిన వ్యక్తి... ఈరోజు వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నాడు. పై ఫోటోలో కనిపించిన వ్యక్తి అతనే. ఫోటో ని వర్ణిస్తే కరోనా పై జయించి ఇంటికి వెళ్తున్న అతనికి ఆసుపత్రి సిబ్బంది చప్పట్లు కొడుతూ అభినందనలు తెలుపుతున్నారు. ఈరోజు తమిళనాడులో 74 కొత్త కేసులు నమోదయ్యాయి. వారిలో 73 మంది తబ్లీజీ జమాత్ ప్రార్థనలకు హాజరయ్యారని... ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 485కి చేరుకుందని తమిళనాడు హెల్త్ సెక్రెటరీ బీలా రాజేష్ వెల్లడించారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ వర్కర్లకు పోలీసులకు ఇంకా ఇతర సిబ్బంది ఎవరైతే కోవిడ్ 19 వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తూ చనిపోతారో వారికి 50 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రకటించింది.


ప్రపంచలో మొత్తం కేసులు: 1,138,304
మరణాలు: 61,141
రికవరీ కేసులు: 236,097

ఇండియాలో మొత్తం కేసులు: 3152
మరణాలు: 86
కొత్త కేసులు: 46
రికవరీ కేసులు: 235

తెలంగాణలో మొత్తం కేసులు: 229
యాక్టివ్ కేసులు: 186
కొత్త కేసులు: 75
మృతులు: 11
కోలుకున్నవారు: 32

ఏపీలో మొత్తం కేసులు: 180
కొత్త కేసులు: 16
మృతులు: 2

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
నెల్లూరు: 32
కృష్ణా: 27
గుంటూరు: 23
కడప: 23
ప్రకాశం: 18
పశ్చిమ గోదావరి: 15
విశాఖపట్నం: 15
తూర్పు గోదావరి: 11
చిత్తూరు: 10
కర్నూలు: 4
అనంతపురం: 2

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple: https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: