కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న  విషయం తెలిసిందే. ఇప్పటికే  11 లక్షల మంది వరకు ఈ కరోనా బారిన పడ్డారు. అయితే చాలా దేశాల్లో ఈ కరోనాని వ్యాప్తి అడ్డుకునేందుకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలు బయటకు రాకపోవడం వల్ల కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పెట్టే అవకాశముంది. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జపాన్ దేశం ఎలాంటి లాక్ డౌన్ అమలు చేయడం లేదు. ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. లాక్ డౌన్ మాత్రం పెట్టలేదు.

 

ఎందుకంటే జపాన్ దేశం వాళ్ళు పని చేయకుండా ఉండలేరు. వారికి పని అంటేనే ప్రాణం. ఒకవేళ వాళ్లకు పని లేకుండా ఉంటే, ఒత్తిడికి గురయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు జపాన్ వాళ్ళు పనికిచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. అందుకే కరోనా విజృంభిస్తున్నా, కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని ఆదేశాలు జారీ చేసినా, జపనీయులు మాత్రం ఆఫీసులకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా ప్రతిరోజూ రోడ్లు రద్దీగా మారుతున్నాయి. ఇంకా బస్సులు ట్రైన్లు కిక్కిరిసిపోయి ఉంటున్నాయి.

 

ఇక ఇదే పరిస్థితి కొన్ని రోజులు కొనసాగితే, కరోనా మరింత  విజృంభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జపాన్ లో దాదాపు 3 వేల వరకు కరోనా బాధితులున్నారు. అంటే కరోనా బాధితుల్లో మనదేశానికి దగ్గరగా ఉంది. అంకెల పరంగా  చూసుకుంటే కాస్త తక్కువగానే కనపడుతున్న, రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

 

ఈ విధంగానే జపాన్ లో లాక్ డౌన్ పెట్టకుండా ఉంటే, బీభత్సంగా కరోనా వ్యాప్తి పెరిగే  అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మాములుగా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా, జపనీయులు మాత్రం ఆఫీసులకు వెళ్లకుండా ఉండలేరని, కాబట్టి ప్రభుత్వమే ఏదైనా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. లాక్ డౌన్ విధిస్తేనే కాస్త ఆగుతారని అంటున్నారు. కానీ జపాన్ ప్రధాని షింజో అబే మాత్రం ఆరోగ్య ఎమర్జెన్సీ విధించే అవకాశం లేదని ప్రకటించారు. ఇక దీని బట్టి చూసుకుంటే జపాన్ లో లాక్ డౌన్ పెట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే జపాన్ వాళ్ళు పని లేకుండా ఉండలేరనుకుంటా!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: