ఒకప్పుడు ప్రకృతి వడిలో మనిషి ఎంతో హాయిగా.. ప్రశాంతంగా గడిపేవారో తెలిసిందే.  ఆ కాలంలో ఎలాంటి కాలుష్యం లేకుండా.. పచ్చటి అందాలు.. కాలుష్యం లేని నీరు.. గాలి తో మంచి ఆయుష్షుతో బతికేవారు.  అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం.. అదీ విషంగా మారుతూ మనిషి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుంది.  గాలి, నీరు, వాతావరణం ప్రతీదీ కాలుష్యంతో నిండిపోతుందని అంటున్నారు.  దుమ్మూదూళీ, శబ్ధ కాలుష్యం ఒక్కటేమిటి తినే తిండీ తాగే నీరు ప్రతిదీ కాలుష్యంగా మారుతుంది.  అలాంటిది ఏ ముహూర్తంలో కరోనా అంటూ దేశంలో లాక్ డౌన్ మొదలైందో కానీ.. ఇప్పుడు అందరూ ఇంటిపట్టున ఉంటున్న విషయం తెలిసిందే.   

 

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం తగ్గిపోయింది. దశాబ్దాల కాలంగా కనుమరుమైన ప్రకృతి అందాలను ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా మళ్లీ చూడగలుగుతున్నారు ప్రజలు. ఇప్పటివరకు కంటికి కనిపించని పక్షలు ఇప్పుడు మన ఇళ్ల ముందుకు వస్తున్నాయి. ఆహా కాలుష్యం లేని గాలి అన్నట్టు పలుచోట్ల అడవుల్లో ఉండే జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. భారత్‌లో కూడా వాయు కాలుష్యం తగ్గి ఇప్పుడు కొంతమేరకు స్వచ్ఛమైన గాలి లభిస్తోంది. పంజాబ్‌లోని జలందర్ సిటీ వాసులకు కేవలం 213కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని దౌలాబార్ హిమాలయాల రేంజ్ కనిపించేది కాదు. 

 

మొన్నటి వరకు ఇక్కడ దుమ్మూదూళీ పేరుకు పోవడం వల్ల ఏమీ కనిపించేది కాదు. దశాబ్దాల తర్వాత మళ్లీ.. పూర్తిగా మంచుతో కప్పబడిన ఆ హిమాలయ పర్వత శ్రేణులను సృష్టంగా చూస్తున్నారు. దీంతో జలంధర్ సిటీవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ ఈ ఫోటోలను ట్వీట్ చేస్తూ.. ‘జలంధర్ వాసులు కొన్ని దశాబ్దాలుగా చూడని దౌలాబార్ ‌రేంజ్‌ని మళ్లీ చూస్తున్నారు. కాలుష్యం ఈవిధంగా మనలను అంధులను చేసింది’ అని పేర్కొన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: