క‌రోనా వైర‌స్ ఉధృతికి కార‌ణమైన త‌బ్లిగి జ‌మాత్ ప్ర‌తినిధుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వెన‌కేసుకువ‌చ్చారు. కావాల‌ని ఎవ‌రూ క‌రోనా అంటించుకోర‌ని, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి వెళ్లిన‌ప్పుడు త‌మ‌కు తెలియ‌కుండానే వ్యాధి బారిన ప‌డ్డార‌ని అన్నారు. ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌గా చెప్పుకోచ్చారు. ఈ సంఘ‌ట‌న‌ను ఓ మతానికి ఆపాదించకూడదని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  హిత‌వు ప‌లికారు.  ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌ కార్యక్రమం వల్ల దేశంలోని 17 రాష్ట్రాల్లో వందలాది మందికి కరోనా వైరస్ వ్యాపించిందంటూ విమర్శలు వస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ కార్యక్రమ నిర్వాహకులకు బాసటగా నిల‌వ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. 

 

శ‌నివారం అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, జగ్గీ వాసుదేవ్ ఈషా ఫౌండేషన్, మాతా అమృతానందమయ సభలు, పాల్ దినకరన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జాన్ వెస్లీ ఇలా ఎంతోమంది ఆధ్యాత్మిక‌త‌తో శాంతిని పెంపొందించేందుకు, మాన‌వ జీవితం స‌రైన మార్గంలో న‌డిచేలా బోధ‌న‌లు చేస్తున్నార‌ని అన్నారు. . ‘ఇదే సంఘటన ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో అయినా జరగొచ్చు. మన దేశంలో చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వారికి లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇది ప్ర‌జాస్వామిక దేశం. 

 

ఎవ‌రూ ఏ కార్య‌క్ర‌మంలోనైనా పాల్గొన‌వ‌చ్చు. ఢిల్లీలో జ‌రిగిన మ‌ర్క‌జ్ ఘ‌ట‌న కూడా అదే విధంగా జ‌రిగింది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు క‌రోనా అక్క‌డి నుంచి ప్ర‌తినిధుల ద్వారా దేశ‌మంతా వ్యాపిస్తోంది. వారికి తెలియ‌కుండా జ‌రిగిన దానికి ప్ర‌తినిధుల‌ను త‌ప్పుబ‌ట్టాల్సిన‌, నిందించాల్సిన ప‌నిలేద‌ని, అలాంటి వారికి వీలైతే బాస‌ట‌గా నిల‌వాల‌ని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా బాధితుల మీద కరుణ చూపాల్సిన సమయంలో ఇలా వారిని వేరు చేసి చూడొద్దని జగన్ మోహన్ రెడ్డి హిత‌వు ప‌లికారు. కరోనా కాటుకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ధనిక, పేద తేడా లేదన్న విష‌యం గ్ర‌హించి ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని పిలుపునిచ్చారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: