దేశ ప్రైమ్ మినిస్టర్ నుండి సామాన్యుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు కరోనా వైరస్. వైరస్ వల్ల చాలామంది ఇప్పటికే  మృత్యువాత పడ్డారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో ఈ వైరస్ ని ఎదుర్కోవటానికి మందు లేకపోవడంతో నియంత్రణ ఒకటే మార్గం కావడంతో భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దేశంలో అన్ని రంగాలు మూతపడ్డాయి. కేవలం నిత్యావసర దుకాణాలు అదేవిధంగా కూరగాయల దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. అదికూడా ప్రభుత్వాలు నియమించిన నిబంధనల సమయం మేరకు మాత్రమే. ఇటువంటి టైములో మందుబాబులకు ఎన్నడూ లేని కష్టాలు వచ్చిపడ్డాయి.

 

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ తో అందరూ ఇళ్లల్లో ఉండటంతో.. రోజు మందు తాగే అలవాటు ఉన్న మందుబాబులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా 90 అయినా వేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు కొనుక్కునేందుకు ప్రభుత్వం ఇచ్చిన టైంలో మందుబాబులు మందు ఎక్కడ బ్లాక్ లో దొరుకుతుందని తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అయితే ఇదే టైం అనుకున్నారో ఏమో తెలియదు గానీ ఇంటర్నెట్ లో కొందరు సైబర్ మోసగాళ్లు దీన్ని క్యాష్ చేసుకోవడానికి మందుబాబులకు వల వేస్తున్నారు. వైన్‌షాపుల పేరిట గూగుల్‌లో తమ నెంబర్లు అప్‌లోడ్‌ చేస్తున్నారు.

 

మందును డోర్‌ డెలవరీ ద్వారా సరఫరా చేస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఈ నెంబర్లకు ఫోన్‌చేస్తే… గంటలో మందు తెచ్చి ఇస్తామని… ఆన్‌లైన్‌ లో పేమెంట్‌ చేయాలని కోరుతున్నారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు అడిగి బురిడీ కొట్టిస్తున్నారట. దీంతో చాలామంది మోసపోతున్నారు. చాలావరకు నిజం అని నమ్మి మందు తాగడం కోసం మందుబాబులు తమ అకౌంట్ లో ఆన్లైన్ లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయంపై ప్రత్యేకమైన దృష్టి సారించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: