భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కఠినంగా కొనసాగుతున్న కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అయితే విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కాకుండా, ఇటీవల ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వల్ల మరింతగా కరోనా విజృంభించింది. అక్కడ ప్రార్థనలకు విదేశాల నుంచి కూడా భక్తులు రావడం, వారిలో కొందరికి కరోనా ఉండటంతో, ఆ ప్రభావం భారతీయ భక్తులపైనా కూడా పడింది. ఫలితంగా కరోనా కేసులు ఎక్కువైపోయాయి.

 

అయితే ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొందరు ఓ మతాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వారి వల్ల కరోనా పెరిగిందంటూ, వారు దేశద్రోహులు అంటూ విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రధాని మాత్రం ఇలాంటి వ్యాఖ్యలకు చెక్ పెట్టేలా మనమంతా ఒకటే అనేలా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు, ఇంటి లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు లేదా టార్చ్ లైట్స్ ఆన్ చేయాలని కోరారు.

 

ఇక ప్రధాని తీసుకున్న నిర్ణయానికి అందరూ పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నిర్ణయానికి ఇటు ఏపీ సీఎం జగన్, అటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్  థాకరేలు కూడా మద్దతు పలికి, ముస్లిం మతాన్ని టార్గెట్ చేసుకుని అనవసరంగా విమర్శలు చేస్తున్నవారికి అడ్డుకట్ట వేసేలా కీలక వ్యాఖ్యలు చేసారు. మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు కుల, మత బేధాలు లేవని సీఎం జగన్‌ చెప్పారు. ఆ ఘటన దురదృష్టశావత్తు జరిగిందని, కాబట్టి ఓ మతాన్ని నిందించడం సరికాదని అన్నారు.

 

అటు ఉద్ధవ్ కూడా దీనిపై స్ట్రాంగ్ రియాక్ట్ అవుతూ.. కరోనా తరహాలోనే  కమ్యూనల్ వైరస్‌‌ ఒకటుందని, అయితే, దీనిపై ప్రజలను తప్పుదారి పట్టించేలా మెసేజ్‌లు ఇచ్చినా, ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కోవిడ్-19 వైరస్‌ వ్యవహారంతో మతానికి ముడిపెట్టవద్దని గట్టిగానే చెప్పారు. మొత్తానికైతే జగన్, ఉద్ధవ్  థాకరేలు ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన వారికి సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: