క‌రోనా వైర‌స్ మ‌హమ్మారితో ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామిక దేశ‌మైన భార‌త్‌..అతిపెద్ద సంప‌న్న‌మైన దేశం అమెరికా వ‌ణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ‌నివారం ఫోన్‌లో సంభాషించారు. కరోనాను కట్టడి చేసే విషయంలో ఇరు దేశాల ప్రధానులు కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు మోదీ తెలిపారు. ‘‘డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో చాలా సుదీర్ఘంగా చర్చించాను. కరోనాపై పోరాడేందుకు అమెరికా-భారత్‌ భాగస్వామ్యంలోని పూర్తి బలాన్ని వినియోగించుకునేందుకు నిర్ణయించుకున్నాం’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

 

ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి మరింత తీవ్రమవుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. ఒక్క ఐరోపా ఖండంలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని 200 దేశాలకు కరోనా వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇక అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గంట‌గంట‌కు పెరిగిపోతోంది.  ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడలేదు.  ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనాకు సంబంధించిన లెక్క‌లు ఈ విధంగా ఉన్నాయి.  1,095,917 పాజిటివ్ కేసులు, మొత్తం మరణాలు 58,787, కోలుకున్న వారు 225,796, ప్రస్తుత కేసులు 811,334 న‌మోదై ఉన్నాయి.

 

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంలోనే వైరస్ కేసులు అధికంగా నమోదుకావడంతో ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురవుతోంది. సంపన్నమైన దేశం, టెక్నాలాజీని సొంతం చేసుకుని జీవశాస్త్ర పరిశోధనల్లోనూ అందరికన్నా ముందున్న అమెరికాను చూసి ఇప్పుడు జాలిప‌డే ప‌రిస్థితికి జారుకుంటోంది. ఇట‌లీలో రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య శాతం త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంపై ఆ చిన్న ఐరాపా దేశ‌వాసులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. పో క‌రోనా పిశాచ‌మా అంటూ ఇట‌లీలో నినాదాలు చేస్తున్నారు. ఇక‌ భార‌త్‌లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతూ పోతున్నాయి.  నిజాముద్దీన్ మర్కజ్ మూల‌ల‌తో క‌రోనా వైర‌స్ దేశం న‌లుమూల‌ల విస్త‌రించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: