కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ దేశంలో ఉన్న ఆర్థిక మూలాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ కి ముందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం రావడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. దీంతో చాలా రంగాలు మూతపడ్డాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఒక దేశం నుండి మరొక దేశానికి సంబంధించి రవాణా కూడా ఆగిపోయింది. ఇదే టైములో ఎక్కువగా విమానయానం, పర్యాటక రంగాలు కోలుకోని రీతిలో దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ప్రముఖ విమాన తయారీ కంపెనీ బోయింగ్ అనే సంస్థ తీవ్ర స్థాయిలో దెబ్బతింది. గతంలోనే ఈ కంపెనీకి సంబంధించిన విమానాలు చాలావరకూ ప్రమాదాలకు గురి కావడంతో సంక్షోభంలో అప్పట్లోనే పడిపోయింది.

 

అయితే తాజాగా కరోనా ఎఫెక్టుతో పూర్తిగా దుకాణం సర్దుకునే స్థితికి వచ్చినట్లు ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓ డేవిడ్ కల్ హోన్ చేస్తున్న వ్యాఖ్యలు బట్టి అర్థం అవుతుంది. ఓటి మేటర్ లోకి వెళితే ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎక్కువగా వినబడుతున్న మాట ' లే ఆఫ్ ' అంటే స్వచ్ఛందంగా ఉద్యోగస్తులు తమ కంపెనీల నుండి ఉద్యోగాన్ని వదులుకోవాలని. తాజాగా విమాన తయారీ కంపెనీ బోయింగ్ సీఈఓ సీఈఓ డేవిడ్ కల్ హోన్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఓ లెటర్ రాయడం జరిగింది.

 

సంస్థలో ఉన్న ఉద్యోగస్తుల ఉద్యోగాలు పోకుండా ఉండాలని చివరివరకు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే చాలా టైం పడుతుంది. రాబోయే సంవత్సరాలలో కంపెనీ నడవటం చాలా కష్టం అని కంపెనీ ఉద్యోగస్తులకు లెటర్ రాయటం జరిగింది. అర్హులైన ఉద్యోగులు తగిన లబ్ధి కలిగిన ప్యాకేజ్ తో కంపెనీ విడిచి వెళ్లేందుకు స్వచ్ఛంద లేఆఫ్ ప్రణాళిక తీసుకొస్తున్నట్టు తెలిపారు. రెండు మూడు వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు తెలియజేస్తామని అందులో వివరించారు. మొత్తంమీద చూసుకుంటే రాబోయే రోజుల్లో కరోనా వైరస్ దెబ్బకి చాలా కంపెనీలు 'లే ఆఫ్' ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. అంతేకాకుండా కరోనా వైరస్ దెబ్బకి నిరుద్యోగం తో పాటు ఆకలి కేకలు కూడా ప్రపంచంలో ఎక్కువ అవుతాయి అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: