ఏప్రిల్ 5వ తేదీన చరిత్రలోకి వెళ్లి  చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు  జననాలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 

 పూతలపట్టు శ్రీరాములు రెడ్డి జననం : ప్రముఖ తెలుగు కవి అనువాదకులు అయినా  పూతలపట్టు శ్రీరాములు రెడ్డి ఏప్రిల్ 5,  1992 లో జన్మించారు. ఆంధ్ర కంబార్ గా ప్రసిద్ధిచెందిన పూతలపట్టు శ్రీరాములు రెడ్డి చిత్తూరు జిల్లాలో జన్మించారు. పాఠశాల విద్య నుంచే స్వయంకృషితో ఆంధ్ర తమిళ సంస్కృతి సాహిత్యాలను చదువుకున్నారు పూతలపట్టు శ్రీరాములు రెడ్డి. ఈయన ఎన్నో అద్భుతమైన గ్రంథాలను రచించి ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈయనకు వేలాది మంది శిష్యులు మిత్రులు ఉన్నారు. ఆయన శిష్యులు మిత్రులు బంధువులు అభిమానులు కలిసి...ఆయన  సేవలకు గుర్తింపుగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1971 నవంబర్ 8 వ తేదీన మరణించారు. 

 

 

 జగ్జీవన్ రామ్ జననం  : స్వతంత్ర సమరయోధుల్లో  ముఖ్యుడు.. ఎంతగానో పేరొందిన స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త అయిన జగ్జీవన్ రామ్  1908 ఏప్రిల్ 5వ తేదీన జన్మించారు. బీహార్ లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ఈయన ... స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో పాటు... భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. అంతే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారు జగ్జీవన్ రాం. 

 

 

 ఇటికాల మధుసూదన్ రావు జననం :  ప్రముఖ ఉద్యమకారుడు రాజకీయవేత్త పైన ఇటికాల మధుసూదన్ రావు 1918 ఏప్రిల్ 5వ తేదీన జన్మించారు. యవ్వన ప్రాయం నుంచి ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని... ఎన్నో  పోరాటాల్లో  పాల్గొన్నారు. ఉద్యమ అవసరాల రీత్యా దేశమంతా పర్యటించారు ఈయన. వైద్య విద్యా సంస్థలు ఏర్పాటుతోపాటు పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్థాపనలో కీలక పాత్ర పోషించారు. పోరాటాలతోనే ఆయన జీవనం సాగించారు. పోలీస్  దెబ్బలు,  కఠిన కారాగార శిక్షతో ఆరోగ్యం క్షీణించి 40 ఏళ్ల వయసులోనే అమరులయ్యారు ఇటికాల మధుసూదన్ రావు. రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పటికీ చిల్లిగవ్వ కూడా దాచుకొని నిస్వార్థ జీవి మధుసూదనరావు. చివరికి అంత్యక్రియలు సైతం డబ్బులు లేకపోతే ప్రజలు చందాలు వేసుకుని మరీ అంత్యక్రియలను చేశారు. 

 

 

 బిత్తిరి సత్తి జననం : ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత అయినా బిత్తిరి సత్తి 1979 ఏప్రిల్  ఐదవ తేదీన జన్మించారు. చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఇష్టం పెంచుకున్న రవి... తాను కూడా సినిమాల్లోకి నటించాలని... నాటక కళాకారుల వద్ద శిక్షణ తీసుకొని నాటకాలలో నటించారు. ఎన్నో చానెల్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన రవి 2015 v6 ఛానల్ లో చేరి తీన్మార్ సావిత్రి తో కలిసి ప్రతి రోజూ తీన్మార్ వార్తల్లో  బిత్తిరి సత్తిగా తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యారు. ఇక అప్పటినుండి  అతని పేరు రవి కాకుండా బిత్తిరి సత్తి గా మారిపోయింది. ఇక అప్పటి నుంచి బిత్తిరి సత్తి పాత్రలో రవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఎన్నో సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకొని నటించాడు బిత్తిరి సత్తి. ఏకంగా తుపాకి రాముడు అనే సినిమాలో హీరోగా కూడా నటించారు. 

 

 దివ్యభారతి మరణం  : ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకున్న నటి దివ్యభారతి.  నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేశారు. ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న దివ్యభారతి ఆ తర్వాత తెలుగు తెరపై కనుమరుగయ్యింది. ఈమె  1993 ఏప్రిల్ 5 వ తేదీన మరణించాడు. 

 

 

 చంద్రమౌళి మరణం  : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు చంద్రమౌళి 2018 ఏప్రిల్ 5వ తేదీన మరణించారు. సుమారు 45 సంవత్సరాల పాటు సహాయ నటుడిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేశారు చంద్రమౌళి. ఏకంగా 150కి పైగా సినిమాల్లో నటించారు, బుల్లితెర సీరియల్స్ లో  కూడా నటించి పేరుతెచ్చుకున్నారు చంద్రమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: