ప్రస్తుతం కరోనా  వైరస్ అన్ని దేశాలను కబళిస్తున్న విషయం తెలిసిందే . ప్రపంచంలో చాలా దేశాలు తమ తమ దేశాలలో కరోనా  వైరస్ ను  కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం లాక్ డౌన్  లోనే ఉన్నాయి అని చెప్పాలి . రోజురోజుకు విజృంభిస్తూ  ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.కరోనా ను  కట్టడి చేసేందుకు... ఎన్నో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కనీసం ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టలేని పరిస్థితి. ఇక విద్యా సంస్థలు కూడా పూర్తిగా మూసివేయడంతో పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే సాధారణంగానే పిల్లలు గోల గోల  చేస్తూ ఉంటారు. 

 

 

 ఒక్కచోట కుదురుగా ఉండరు. ఇక ఇప్పుడు ఏకంగా రోజులకు రోజులు ఇంట్లోనే ఒకేచోట ఉండాలంటే పిల్లలు తీసుకు వచ్చే తలనొప్పి మామూలుది కాదు. అంతేకాకుండా హాలిడేస్ వస్తే చాలు అక్కడికి తీసుకు వెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అని తల్లిదండ్రులతో మారాం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్ద వాళ్ళు అయితే పరిస్థితిని అర్థం చేసుకుని రోజంతా ఇందులో కూర్చోగలరు. కానీ పిల్లలు మాత్రం పరిస్థితిని అర్థం చేసుకోలేరు  కదా అందుకే ఒకే దగ్గర కూర్చోకుండా బయటికి తీసుకెళ్లాలి అంటూ మారాం చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంటి నుంచి కాలు బయట పెడితే చాలు ప్రాణాంతకమైన వైరస్ ను  ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆండ్రూ బాల్జాక్,  అతని స్నేహితుడు జాసన్ బైర్డ్  తో కలిసి పిల్లల్లో ముఖంలో సంతోషం నింపేందుకు ప్రయత్నాలు చేశారు. 

 

 

 వీరిద్దరూ కలిసి  సూపర్ మాన్ వేషం వేసి లండన్ వీధుల్లో తిరుగుతూ అక్కడి పిల్లలను బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు . వీరిద్దరూ మార్షల్ ఆర్ట్స్ తరగతులు బోధించే టీచర్లు. క్లాస్ లో  ఆండ్రూ సూపర్ మాన్ డ్రెస్  వేసుకోని  రావడంతో అక్కడి పిల్లలను ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ బోధించే టీచర్స్ కావడంతో వీళ్ళు చేసే స్టంట్  కూడా పిల్లలను ఎంతగానో అలరించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ గా  మారిపోయింది. అయితే మహమ్మారి కరోనా వైరస్  సైతం లెక్క చేయకుండా పిల్లల ఆనందం కోసం పెద్దలు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: