ఇప్పుడంతా క‌రోనా క‌ల‌క‌ల‌మే. ప్ర‌పంచవ్యాప్తంగా దేశాల‌న్నీ అట్టుడికి పోతున్నాయి. కరోనా వైరస్‌ దెబ్బకు ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు తీవ్రంగా ప్ర‌భావితం అవుతున్నాయి. వేలాది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. కరోనా దెబ్బకు ఎక్కడిక్కడ వ్యాపారాలన్ని స్తంభించిపోయి, దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని కుప్పకూలిన సంగతి తెలిసిందే. వ్యాపారాలు రన్ అయ్యేందుకు పలు కఠిన చర్యలు తీసుకుంటున్నాం… నీ పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయన్నది తెలియడం లేదని కంపెనీలు ఉద్యోగులకు చెబుతున్నాయి. ఇలాంటి షాకుల స‌మ‌యంలో ఓ ఊహించ‌ని వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది.ప్రముఖ సరుకుల రవాణా సదుపాయాల సంస్థ బిగ్ బాస్కెట్‌ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది.గిడ్డంగులు, లాస్ట్‌-మైల్‌ డెలివరి అవసరాల నిమిత్తం 26 నగరాల్లో పది వేల మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు బిగ్‌బాస్కెట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(మానవ వనరులు) తనుజా తివారీ తెలిపారు. 

 

త‌మ నిర్ణ‌యం గురించి త‌నుజా తివారీ వెల్ల‌డిస్తూ...కరోనా వైరస్‌ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సరుకుల రవాణా కోసం దేశవ్యాప్తంగా 10 వేల మందిని రిక్రూట్‌ చేసుకోబోతున్నట్లు పేర్కొంది. త‌మ స‌రుకుల వృథాను అరిక‌ట్ట‌డం, వాటిని వినియోగ‌దారుల‌కు చేర‌వేయ‌డం ల‌క్ష్యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొంది.

 

 


కాగా, స్టాఫ్‌‌ను తగ్గించడంతో పాటు, కొంత మంది ఉద్యోగులకు జీతాలను కూడా తగ్గిస్తున్నట్టు కొన్ని స్టార్ట‌ప్‌ సంస్థలు ఉద్యోగులకు తెలిపాయి. కొన్ని వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని, అవి లాంగ్‌‌ టైమ్‌‌లో కూడా రికవరీ అయ్యే సూచనలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు వివిధ సంస్థ‌ల ప్ర‌తినిధులు. వీటిలో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తీసివేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొన్ని రోల్స్‌‌లో టీమ్స్‌‌ ను కన్సాలిడేట్ చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే రెండు నెలలు రూ.40 వేల వేతనం ఉన్న వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని క్లౌడ్ కమ్యూనికేషన్ సంస్థ ఎక్సోటెల్ చెప్పింది. నెల తర్వాత పరిస్థితి చూసి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: