కరోనా వైరస్ తో పోరాడుతున్న ప్రపంచ దేశాలకు భారత్ యొక్క ఐకమత్యం చూపిద్దామని ప్రధాని మోడీ ఏప్రిల్ 5 ఆదివారం అనగా ఈ రోజు రాత్రి 9 గంటల 9 నిమిషాల క్రితం అందరూ ఇంటిలో ఉన్న లైట్లు ఆపేయండి అంటూ పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంటిలో ఉన్న వాళ్లు బయటకు వచ్చి వెలుగుతున్న కొవ్వొత్తు గాని, లేకపోతే దీపంతో గాని ఇంకాస్త కుదరకపోతే టార్చ్ లైట్ తో కానీ బయట నిలవాలని పిలుపు ఇచ్చారు. దేశమంతటా ఈ విధంగా ఒకే విధంగా ఈ విధమైన వెలుగులతో బాల్కని బయటగాని ఇంటి టెర్రస్ పైన గాని చేస్తే ప్రపంచానికి భారతీయ ఐక్యమత్యం తెలుస్తుందని చెప్పుకొచ్చారు.

 

అదేవిధంగా ఈ విధంగానే వైద్యులకు కూడా మద్దతు తెలపాలని సూచించారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త పై సోషల్ మీడియాలో ' లైట్లు ఆపాలా వద్దా .. ' దేశం మొత్తం ఇదే డిస్కషన్ గట్టిగా జరుగుతుంది. దేశమంతటా ఒక్కసారి లైట్లు ఆఫ్ చేస్తే విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉందని విద్యుత్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మొదటికే మోసం వస్తుందని చాలామంది అంటున్నారు.

 

ఈ మేరకు విద్యుత్ ఇంజనీర్లు ప్రధాని కార్యాలయానికి లెటర్ రాయడం జరిగింది. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం ఒకేసారి పెరిగిన...తగ్గిన గ్రిడ్ పనిచేయడం నిలిచిపోతుందని.. అందరూ లైట్స్ ఆఫ్ చేస్తే పెను ప్రమాదమని నివేదించినట్టు తెలిసింది. కేవలం లైట్లు ఆపేసి ఏసీలు ఫ్యాన్లు పెంచుకుంటే బాగుంటుందని మరికొంత మంది విద్యుత్ నిపుణులు అంటున్నారు.  



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: