స‌హ‌జంగా భార‌త్‌ను చూసి ఈర్శ‌తో తిట్టిపోయ‌డ‌మే ప‌నిగా పెట్టుకునే మ‌న దాయాది దేశం పాకిస్తాన్ ఓ విష‌యంలో మాత్రం భార‌త్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింతి. మీరు చాలా గొప్ప అంటూ కితాబిచ్చేసింది. ఎయిరిండియా... మీ సేవలు చూస్తే గర్వంగా ఉంది.’ అంటూ పాకిస్తాన్ గ‌గ‌న‌త‌లంపై వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని చూసిన అక్క‌డి కంట్రోల్ రూం ప్ర‌తినిధులు చేసిన కామెంట్ ఇది.  కొన్ని సరుకులు, కరోనా వల్ల భారత్‌లో చిక్కుకున్న కొందరు ఐరోపా వాసులను పాక్ గ‌గ‌న‌త‌లం మీదుగా
ఎయిరిండియా ఫ్రాంక్‌ఫ‌ర్డ్ వెళ్తోంది.  సాధార‌ణంగా క‌న్ఫ‌ర్మేష‌న్ కోసం ద‌గ్గ‌ర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు సంకేతాలు వెళ్తుంటాయి.

 

 అందులో భాగంగానే క‌రాచీ కంట్రోల్ రూం క‌న్ఫ‌ర్మేష‌న్ చేసుకునేందుకు ఎయిరిండియా పైలట్‌కు సంకేతాలు పంపింది. ఆ సందేశాన్ని స‌ద‌రు పైలట్ ఓ న్యూస్ ఏజెన్సీకి వివ‌రించారు. ఆ సందేశం ఇలా ఉంది.  ‘మేం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే మాకు పాకిస్తాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి  అస్సలాం ఆలైకుం అంటూ ఓ సందేశం వచ్చింది.  ఇది కరాచీ కంట్రోల్. ఫ్రాంక్ ఫర్ట్ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి స్వాగతం.’ అంటూ ప్ర‌తినిధి మాతో మాట్లాడారు. అనంతరం ‘ఇది ఫ్రాంక్ ఫర్ట్ వెళ్తున్న ఎయిరిండియా విమానమేనా. ఓసారి ధ్రువీకరించండి.’ స‌ద‌రు ప్ర‌తినిధి మ‌మ్మ‌ల్ని కోరారు. మేమే దాన్ని ధ్రువీక‌రించాం అంటూ వివ‌రించారు. 

 

అనంతరం పాకిస్తాన్ గగనతలం దాటుతున్న సమయంలో మరోసారి పాకిస్తాన్ ఏటీసీ నుంచి మాకు  మరో సందేశం వచ్చింది. అదేమంటే ‘కరోనా మహమ్మారి భార‌త్‌ను వీడిస్తున్న స‌మ‌యంలోనూ  ఫ్లైట్స్ నడుపుతున్న ఎయిరిండియాను చూస్తుంటే గర్వంగా ఉంది. గుడ్ లక్.’ అంటూ స‌ద‌రు ప్ర‌తినిధి వ్యాఖ్య‌నించిన‌ట్లు ఎయిరిండియా ప్ర‌తినిధి న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. పాకిస్తాన్ కంట్రోల్ రూం ప్ర‌తినిధి మాట‌లు విన్న‌ప్పుడు నాకెంతో గ‌ర్వంగా అనిపించింద‌ని ఎయిరిండియా పైల‌ట్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. ఈ సందేశం విన్న మాకు భార‌త్‌పై గ‌ర్వ‌మే కాదు...పాకిస్తాన్ ఎయిర్ కంట్రోల్ రూం అధికారిపై త‌న‌కు ఎంతో గౌర‌వం క‌లిగియ‌ని  పేర్కొన్నారు.  ఆ త‌ర్వాత‌ ఇరాన్ గగనతలం దాటే సమయంలో వాళ్లు కూడా ‘ఆల్ ద బెస్ట్’ చెప్పారు. ఎయిరిండియా స్పెషల్ ఫ్లైట్లు ఆ తర్వాత టర్కీ, అటు నుంచి జర్మనీ వెళ్లాయి. అందరూ ఎయిరిండియాను గర్వంగా స్వాగతించాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: