భారతదేశం మొత్తాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు యథేచ్ఛగా కోరలు  చాస్తున్న ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు... కరోనా  వైరస్ నియంత్రణ మాత్రం జరగడం లేదు. ఇప్పటికే వీటిలో భారతదేశంలో మూడు వేలకు పైగా కరోనా  పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. భారతదేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహారాష్ట్రలో మూడు వేలకు పైగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరుణ వైరస్ పై  పోరాటంలో భాగంగా అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. 

 

 

 అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కరోనా  వైరస్ మాత్రమే కాదు మరో వైరస్ కూడా ఉంది అంటూ  వ్యాఖ్యానించారు. కరోనా  వైరస్ తో పాటు కమ్యూనల్ వైరస్ కూడా ఉందని దీని ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేలా చేసినా లేదా ఏదైనా అసభ్య వీడియోలు పోస్ట్ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీలో ఏదైతే తప్పు జరిగి ప్రస్తుతం దేశం మొత్తం బాధ పడాల్సిన పరిస్థితి వచ్చిందో అలాంటి తప్పు మహారాష్ట్రలో పునరావృతం కానీయం అంటూ స్పష్టం చేశారు. అంతకుముందు వరకు జమాత్ ఈవెంట్ కోసం అనుమతి ఇచ్చినప్పటికీ పరిస్థితులకనుగుణంగా అనుమతి ఉపసంహరించుకున్నట్లు  ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

 

 

 ఢిల్లీలోని జమాత్ సమావేశానికి వెళ్లిన వారందరినీ అధికారులు గుర్తించారుని తెలిపిన ఉద్దవ్ థాక్రే ... కరోనా  వైరస్ వ్యవహారంలో మతానికి ముడి  పెట్ట వద్దు అంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సహా పలు హోటల్ యజమానులు కూడా సహాయం చేయడానికి సీఎం కార్యాలయం ని సంప్రదించారు అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్  తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు గాని జరగకూడదు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: