భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా తో ఎదుర్కొంటున్న యుద్ధంలో భాగంగా రోజు రాత్రి 9 గంటలకు దేశ ప్రజలందరూ తమ ఇళ్ళలో లైట్లు ఆపేసి కొవ్వొత్తులు వెలిగించి తమ స్ఫూర్తిదాయకమైన పాత్రను తెలియచేయాలని కోరిన విషయం గురించి అందరికీ తెలిసిందే. దేశం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోడీ ఒక్కసారిగా తెర మీదకు వచ్చి బిగ్ బాస్ మాదిరిగా చేస్తున్నట్లు.. ప్రజలందరికీ టాస్క్ లు ఇవ్వడం చాలా సిల్లీగా ఉందని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కూడా.

 

అయితే ఈరోజు రాత్రి 9 నిమిషాల పాటు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తుల వెలిగించడం పై ప్రజల్లో చాలా సందేహాలు అలాగే ఉండిపోయాయి. కొవ్వొత్తులు వెలిగించే ముందు లైట్లు ఖచ్చితంగా ఆపివేయాలా వద్దా అని అనుకుంటూ ఉంటే విద్యుత్ శాఖ ఇప్పుడు మరొక షాకింగ్ విషయం చెప్పింది. ఒక్కసారిగా ప్రజలందరూ లైట్లు ఆపేసి మళ్లీ తొమ్మిది నిమిషాల తర్వాత ఒకేసారి ఆన్ చేస్తే వోల్టేజీ లో తేడాలు వచ్చి గ్రిడ్ పూర్తిగా దెబ్బతింటుందని అంటున్నారు. అలా దెబ్బతిన్న గ్రిడ్ ను పునరుద్ధరించడానికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకు సదరు ప్రాంతాల్లోని జనాలంతా చీకటిలోనే బతకాల్సి వస్తోందని అన్నారు.

 

అయితే కేంద్రం మాత్రం దీనిపై ప్రజలకు ప్రత్యేకమైన అవగాహన కల్పించడం ఇప్పటి నుంచే మొదలు పెట్టింది. మోడీ మాట్లాడుతూ వీధి లైట్లు ఆపాల్సిన అవసరం లేదని.. మరియు ఇంటిలో కేవలం వెలుగుతున్న లైట్ల తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ వేయాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే హాస్పిటల్లో మరి అత్యవసరమైన విద్యుత్తు సరఫరా అవసరమైన ప్రదేశాల్లో కూడా ఎటువంటి లైట్లు ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయినా మన వారు అంతా కలిసికట్టుగా ఒకసారి విద్యుత్తు ఓల్టేజి ని డౌన్ చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అని ఇప్పటికీ కొంతమంది భయపడుతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: