ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా కలకలం సృష్టించిన చైనా తన మిత్ర దేశం అయిన పాకిస్థాన్ కు గట్టి దెబ్బ వేసింది. కరోనా వల్ల పాకిస్తాన్ లో బాధితులు  ఎక్కువ అయిపోగా వారి మిత్ర దేశం అయిన చైనా తమకు పూర్తి స్థాయి సహాయం అందిస్తామని చెప్పి చాలా అవమానకర రీతిలో మోసం చేసింది. చైనా నుండి ఇతర దేశాలకు వైరస్ విస్తరించగా చాలా అనూహ్యంగా చైనా దీని నుండి బయటపడడంతో వారి నుండి సాయం కోరిన పాకిస్తాన్ మామూలు దెబ్బ పడలేదు.

 

వివరాల్లోకి వెళితే కోవిడ్-19 పుట్టిన చైనాలో కరోనా ప్రభావం తగ్గిపోగా అక్కడి మార్కెట్ లు అన్ని మళ్ళీ పుంజుకున్నాయి. ఇకపోతే ఇతర దేశాలకు కావలసిన వైద్య పరికరాలను మరియు ఇతర సామాగ్రిని దేశం ఎగుమతి చేస్తోంది కూడా. ఇదే సమయంలో పాకిస్తాన్ తో ఇలా వైద్య పరికరాలు మరియు సామాగ్రిని అందించే డీల్ కూడా చేసుకుంది. గతవారంగా కరోనా కేసులు పాకిస్తాన్ లో చాలా ఎక్కువగా నమోదయ్యాయి. క్రమంలో వైద్యులు కి కావలసిన మాస్కుల కొరత ఏర్పడగా తాము నాణ్యమైన N95 మాస్కులు అందజేస్తామని హామీ ఇచ్చింది.

 

ఇచ్చిన మాట ప్రకారమే చైనా పాకిస్థాన్ కు n95 mask పంపించగా తీరా వచ్చిన కవర్లను ఓపెన్ చేసి చూస్తే అక్కడి అధికారులు విపరీతమైన షాక్ తిన్నారు. మాస్కుల పేరుతో చైనా చేసిన మోసం మరియు అవమానం పాకిస్తాన్ ను వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు. చైనా నే చునా లగా దియాహెడింగ్ తో పాక్ కు చెందిన మీడియా ఆసక్తికర కథనాన్నిరాసిందట. నాణ్యమైన మాస్క్లు అందజేస్తామని చెప్పి.. అక్కడి వారు వాడిపడేసిన లోదుస్తులను ఇన్నర్ వేర్ లతో తయారు చేసిన మాస్క్లను పాకిస్థాన్కు పంపిందంటూ పేర్కొంది. సింధ్ ప్రావిన్స్ లోని ప్రభుత్వాధికారులు మాస్క్లను చెక్ చేయకుండానే ఆస్పత్రులకు పంపించారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: