గాంధీ ఆసుపత్రి లో ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న కరోనా బాధితులు తమకు బిర్యానీ పెట్టాలని డిమాండ్ చేస్తుండడం తో ఆసుపత్రి వర్గాలకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది .  తమకు అందిస్తున్న భోజనం సరిగ్గా ఉండడం లేదని , బిర్యానీ , స్పైసీ ఫుడ్ కావాలంటూ కరోనా బాధితులు కోరుతుండడం తో వైద్యారోగ్య శాఖ అధికారులు  చేతులెత్తేస్తున్నారు . తమకు మంచి ఆహారాన్ని అందించాలని , లేకపోతే తమను ఇంటికి పంపించాలని కరోనా బాధితులు ఆసుపత్రి సిబ్బందిపై వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది .

 

కరోనా బాధితులకు నాణ్యమైన ఫుడ్ అందజేస్తున్నప్పటికీ , కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా ఈ రకమైన కోర్కెలను కోరుతున్నారని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు . అయితే గాంధీ ఆసుపత్రిలో ఏ రోగికి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలన్న  దానిపై   మార్గనిర్దేశం చేయడానికి డైటీషియన్ లేకపోవడంతో , రోగులందరికి ఒకేరకమైన భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి . కరోనా బాధితులు రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న ఆహార సదుపాయాన్ని కల్పిస్తే వారు తొందరగా కోలుకునే అవకాశాలున్నాయని  రోగుల బంధువులు అంటున్నారు . అయితే బిర్యానీలో రోగ నిరోధక శక్తి అంటూ ఏమి ఉండదన్న విషయాన్ని కరోనా బాధితులు , వారి కుటుంబ సభ్యులు గుర్తించాలని ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు .

 

పండ్లను అధికంగా తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నా  కరోనా బాధితులు పట్టించుకోకుండా బిర్యానీ కోసం డిమాండ్ చేయడం పట్ల ఆసుపత్రి వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు . ఇటీవల ఢిల్లీ లోని మర్కజ్ మసీదు నుంచి  క్వారంటైన్ కు తరలించిన వారు కూడా అక్కడి ఆసుపత్రి సిబ్బందిని ఇదే రకమైన డిమాండ్ చేసిన విషయం తెల్సిందేనని గుర్తు చేస్తున్నారు .  గాంధీ ఆసుపత్రి లో ఇప్పటి వరకు వైద్యులకు చెప్పినట్లుగా నడుచుకుంటూ వచ్చిన కరోనా రోగులు ఈ ఘటన అనంతరం బిర్యానీ డిమాండ్ చేయడం కొత్త అనుమానాలకు తావునిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: