ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒకే  యుద్ధం నడుస్తోంది. కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాల ప్రజలు యుద్ధం చేస్తున్నారు. కనిపించని శత్రువు బారినపడకుండా ఉండేందుకు యుద్ధం... కనిపించకుండానే ప్రాణాలను హరించుకుపోతున్న  ప్రాణాంతకమైన మహామారి తో యుద్ధం. ప్రపంచ వ్యాప్తంగా ఇదే యుద్ధం జరుగుతోంది. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసి ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రపంచం మొత్తం సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తున్న ఈ మహమ్మారి  ఈ వైరస్కు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో అడ్డూ అదుపు లేకుండా నే ఎంతో మందిని బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి.

 

 

 దీంతో ప్రపంచం మొత్తం ప్రాణ భయంతో గడగడాలాడిపోతుంది. ఈ మహమ్మారి  వైరస్ ప్రభావం గల్ఫ్ దేశాల్లో కూడా ఉంది. సౌదీ అరేబియా,  కతార్ లో ఈ వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఇక అటు కువైట్ లో కూడా రోజురోజుకు వైరస్ విజృంభిస్తోంది. అయితే శనివారం రోజున కువైట్లో తొలి కరోనా  వైరస్ మరణం నమోదైంది. ఇక్కడ నమోదైన తొలి కరోనా వైరస్ మరణం భారతీయుడే కావడం గమనార్హం. అంతేకాకుండా శనివారం ఒక్కరోజే 62 కొత్త కరోనా  పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య 479... శనివారం రోజున ఈ మహమ్మారి బారినుంచి పూర్తిగా కోలుకుని 11 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలోనే కువైట్ లో ప్రపంచ మహమ్మారిని జయించి కోలుకున్న వారి సంఖ్య 93 చేరింది. 

 

 

ఈ విషయాన్ని అక్కడి ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ షేక్ బాసెల్ అల్ సభా  వెల్లడించారు. ఇక అన్ని దేశాల లాగానే కువైట్ కూడా కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. జన సమూహాలు ఉండే అన్ని ప్రదేశాలను మూసివేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా వ్యవస్థను మూసివేసింది. ఇదిలా ఉంటే కువైట్ లో కరోనా  వైరస్ సోకిన భారతీయుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. మొత్తంగా కువైట్ లో శనివారం నాటికి నమోదైన 479 కేసులలో భారత్ కు  చెందిన వారే 148 మంది ఉండడం గమనార్హం. అయితే భారతీయులు కువైట్లో ఇరుకైన గదిలో ఉండటం వల్లే కరోనా  వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: