సమాజంలో కొందరు ఉంటారండి.. వాళ్లు సుఖంగా బ్రతకరు.. ఇంకొకరిని బ్రతకనివ్వరు.. ఇలాంటి వారిని మూర్ఖులనాలో ఇంకేం అనాలో అర్ధం కాదు.. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో, మీటింగులకంటే, మతం కంటే, బంధువులు, చుట్టాలకంటే.. ప్రాణం విలువైనది.. అసలు ఈ ప్రాణాలే లేనప్పుడు ఇవేవి కూడా మన దగ్గర ఉండవు కదా.. మరి ఇలాంటి పరిస్దితుల్లో అందరు అన్నదమ్ముల వలే కలిసిమెలసి ఉండి కరోనాను తరిమి కొట్టవలసింది పోయి.. స్వార్ధంతో బ్రతుకుతుంటే ఇన్నాళ్లు నేను భారతీయుడను, నా భారతదేశం సర్వమత సమ్మేళనం అని గొప్పగా చెప్పుకునే దానికి అర్ధం ఉందా..

 

 

ఈ ప్రపంచమే ఒక కుటుంబం.. నీ సమాజమే నీకు చుట్టం.. అలాంటి సమాజానికి కీడుతలపెట్టాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలవల్ల వారిలో ఉన్న మతపిచ్చి ఆనందించవచ్చు కానీ ఏదో ఒకరోజు దానికి తగినట్టుగా ప్రతిఫలం అందుకోక తప్పదు.. ఇకపోతే గతనెలలో ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో దాదాపుగా అందరికి కరోనా పాజిటీవ్ అని తేలింది.. వీరి వల్ల సమాజానికి, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు ప్రమాదం పోంచి ఉంది.. వీరివల్ల కరోనా రెండు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా విజృంభిస్తుంది..

 

 

ఇప్పటికే వైద్య అధికారులు, పోలీసులు ఇలాంటి వారిని గుర్తించి వైద్యం అందిస్తుండగా.. మరికొందరు బాధ్యత మరిచారో, భయం వల్లనో బయటకు రావడంలేదు.. వైద్యులకు సహకారం అందించడం లేదు.. ఇదిలా ఉండగా.. ఇలాగే ప్రవర్తించిన ఒక వ్యక్తివల్ల అతని ఉమ్మడి కుటుంబం మొత్తం ప్రమాదంలో పడింది.. మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లివచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా, ఆ ఇంట్లో46 నుండి 48 మంది వరకు కుటుంబసభ్యులు ఉండటం, వారందరికీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో కింగ్ కోఠి ప్రాంతం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇతను ఇక్కడి వాడే కావడం వల్ల వీరి ఫ్యామిలితో పాటుగా ఆ చుట్టుపక్కలి వారుకూడా రిస్కులో పడ్డారు..

 

 

ఇక ఆ ఢిల్లీ వెళ్లిన వ్యక్తిని పట్టుకుని, పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి శనివారం పాజిటివ్‌గా తేలింది. ఇతనే కాకుండా ఇతనితో పాటు వెళ్లిన మిగతా ఐదుగురి ఇళ్లలో కూడా 20 మంది చొప్పున ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ వారిళ్లలోనే వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు... ఒకరికి మేలు చేయాకపోయినా ఫర్వాలేదు కానీ దయచేసి సమాజానికి కీడు తలపెట్టవద్దని ఈ సందర్భంగా నెటిజన్స్ వేడుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: