ప్ర‌పంచంలో అన్ని దేశాల్లోనూ క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదివారం అప్‌డేట్స్ చూస్తే క‌రోనా బాధితుల సంఖ్య 12 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతోంది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు సైతం 64 వేల‌కు చేరుకున్నాయి. మ‌న‌దేశంలో క‌రోనా గ‌త మూడు రోజుల్లో విజృంభించ‌డంతో ఏకంగా కేసులు 3 వేలు దాటేసింది. ఇక దేశ‌వ్యాప్తంగా 99 మంది ఈ వ్యాధి సోకి మృతి చెందారు. ఇక మ‌న దేశంలో ఢిల్లి నిజాముద్దీన్‌కు వెళ్లి వ‌చ్చిన వారి సంఖ్య అన్ని రాష్ట్రాల్లో ఎక్కువుగా ఉండ‌డంతో పాజిటివ్ కేసులు ఎక్కువుగా న‌మోదు అవుతున్నాయి.

 

ఇక తెలంగాణ‌లో మొత్తం కేసులు 272కు చేరుకున్నాయి. ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 194కి చేరింది. తెలంగాణ‌లో క‌రోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ఒక్క శనివారం రోజే 26 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 6 కేసులు నమోదు కావడంతో గుంటూరు జిల్లా వాసులూ ఉలిక్కిపడుతున్నారు. పెరిగిన వాటితో గుంటూరులో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది.  

 

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 9 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 12, 02, 242

మృతుల సంఖ్య - 64, 729

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 2, 46, 638

యాక్టివ్ కేసుల సంఖ్య - 8, 90, 875

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 3, 11, 367

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 3, 11, 635 - 8454

స్పెయిన్ -  1, 26, 168 - 11, 947

ఇట‌లీ - 1, 24, 632 - 15, 362

 

 
భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 3588

మృతులు - 99

తెలంగాణ‌లో కేసులు - 272

తెలంగాణ మృతులు - 11

ఏపీలో కేసులు - 194

అత్య‌ధికంగా నెల్లూరు, కృష్ణా జిల్లాలో 32 కేసులు

ఏపీలో మృతులు - 1

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: