ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ప్రజలు శాస్త్రవేత్తలు పోలీసులు డాక్టర్లు ఇలా ప్రతి ఒక్కరు  సర్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను చిగురుటాకులా వణికిస్తూ... ప్రాణ భయానికి కలిగిస్తూ... ఎంతో  మందిని పొట్టన పెట్టుకుంది ఈ మహమ్మారి వైరస్. ఈ వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ వైరస్ మాత్రం ఎక్కడా కంట్రోల్ కావడం లేదు. ప్రభుత్వాలు వైరస్ ను కట్టడి చేసేందుకు ఎన్నికల నిబంధనలు అమల్లోకి తెచ్చిన... ప్రజలు చేస్తున్న చిన్న చిన్న నిర్లక్ష్యం కారణంగా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. వెరసి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 

 

 

 అయితే అటు ప్రభుత్వాలు ఎంతో మంది ప్రముఖులు వైద్యులు కరోనా  వైరస్ పై  ప్రజలకు అవగాహన కల్పించి.. తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి వివరిస్తూ... ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఎన్నో ఫేక్ వార్తలు కూడా ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రజలకు అవగాహన కల్పించే వార్తల కంటే ప్రజలను అయోమయంలో పడేసి ప్రాణ భయాన్ని కలిగించే వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా  వైరస్ కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజుకొక వార్త హల్చల్ చేస్తోంది ప్రజలను అయోమయంలో పడేస్తూ భయాందోళనకు గురిచేస్తుంది. 

 

 

 ఇప్పటికే మహమ్మారి వైరస్ కు విరుగుడు లేదు అని భయపడుతున్న జనం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ప్రచారాన్ని మరొకటి ఊపందుకుంది. వివిధ కారణాలు వ్యాధుల దృశ్య రోజు మందులు వాడే వారికి కరోనా  వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై స్పందించిన నిపుణులు వైద్యులు ఈ వార్త అవాస్తవమని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు అని సూచించారు. ఇతర రోగాలకు వాడే మందుల ద్వారా శరీరంలో వైరస్ బలపడుతుంది అనడానికి రుజువులు లేవు అంటూ  నిపుణులు సూచిస్తున్నారు. ఎవరు భయాందోళనకు గురి కాకుండా యధావిధిగా మందులు కొనసాగించాలి అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: