ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని కోవిడ్ 19 ఉందో లేదో టెస్ట్ చేసే పరికరాల కొరతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పటికే ఎన్నో కొత్త టెస్టింగ్ కిట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ టెస్టింగ్ చేసే విధానం చాలా బలహీనంగా ఉంటూ ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. 

 


ఉదాహరణకి ఒక రాష్ట్రంలోని ఒక వ్యక్తికి కరోనా సోకిందని తెలిస్తే... వారి నమూనాలను పూణే లేదా ఇంకో ప్రత్యేకమైన లేబరేటరీ కి పంపించి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. దీని కారణంగా అనుమానితుడి ఫలితాలు వచ్చే సరికి చాలా సమయం వృధా అవుతుంది. అలాగే ఎక్కువ మందిని టెస్ట్ చేసేందుకు కూడా ఆస్కారం లేకపోయింది. దాంతో భారతదేశంలోని కొన్ని ప్రముఖ సంస్థలు తన శక్తి సామర్ధ్యాలతో వేగవంతంగా టెస్టులు చేసే కోవిడ్ 19 కిట్లను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు నగరానికి చెందిన బయోటెక్ స్టార్టప్ అనే ఓ జెనెటిక్ & మైక్రోబయోమ్ పరీక్షా సంస్థ బయోన్ కోవిడ్ -19 ఎట్-హోమ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్‌ను గురువారం రోజు విడుదల చేసింది. 

 


బయోన్ కోవిడ్ -19 ఎట్-హోమ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్‌ ఉపయోగించడం చాలా సులభమని... ఫలితాలు కూడా కేవలం 5 నుండి 10 నిమిషాల్లో వస్తాయని బయోటెక్ సంస్థ అధినేత డాక్టర్ సురేంద్ర కె తెలిపారు. కేవలం రెండు నుంచి మూడు వేల రూపాయలను లభించే ఈ కోవిడ్ 19 స్క్రీనింగ్ టెస్ట్ కిట్ లో ఓ ప్రత్యేకమైన సూది తో పాటు... చేతి వేలుని శుభ్రపరిచేందుకు ఆల్కహాల్ ఇవ్వబడుతుంది. ఈ ఆల్కహాల్ తో ఏదైనా మీ చేతి వేలిని శుభ్రపరుచుకుని... కిట్ లో ఇచ్చిన సూదితో రక్తాన్ని బయటకు తీసి కిట్ పై వేయాలి. ఇలా చేసిన ఐదు పది నిమిషాల అనంతరం ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి.

 

 


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా ఈ కోవిడ్ -19 ఎట్-హోమ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్‌ ఆమోదించింది. ఈ కిట్ లో ఉపయోగించిన అన్ని పరికరాలు FDA ఆమోదించిన కంపెనీల నుండి తీసుకున్నామని బయోటెక్ సంస్థ తెలిపింది. ఈ కిట్ పొందాలనుకునేవారు www.bione.in వెబ్ సైట్ ను సందర్శించి ఆడర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బయోటెక్ సంస్థ కు వారానికి ఏకంగా 20 వేల కిట్లను సరఫరా చేసే సామర్థ్యం ఉంది. కిట్ తో సహా ఎలా వినియోగించాలో స్టెప్ బై స్టెప్ మానువల్ కూడా బయోటెక్ సంస్థ అందజేస్తోంది. కఠినమైన నాణ్యత పరిమాణాలను అధికమించి ఉత్తమమైన కోవిడ్ 19 టెస్ట్ కిట్ గా పేరు సంపాదించిన బయోటెక్ సంస్థ వారు ఇంటి దగ్గరే కరోనా ఉందో లేదో తెలుసుకునే సదుపాయం కల్పించినందుకు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: