భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తూ నిబంధన విధించింది. అన్ని పబ్లిక్ ప్లేస్ లు  మూసి వేయడంతో పాటు.. ప్రజా రవాణా వ్యవస్థను కూడా రద్దు చేసింది. కేవలం అత్యవసర సేవలు మినహా మిగతా అంతా షట్ డౌన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని సూచించింది. ఇలా చేయడం ద్వారా కరోనా  వైరస్ ని తరిమికొట్టొచ్చు అంటూ పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  కి పిలుపునిచ్చిన నేపథ్యంలో మందుబాబుల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. కొంతమంది మందు దొరక ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. 

 

 

 రోజూ మద్యం తాగే అలవాటు ఉన్నవారు కళ్ళు  తాగే అలవాటు ఉన్నవారు.. లాక్ డౌన్ నేపద్యంలో ఇలాంటివేవీ తాగడానికి దొరకకపోవడంతో బ్రెయిన్ పనిచేయక పిచ్చెక్కి పోతున్నారు . పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. ఇలా లాక్ డౌన్ నేపథ్యంలో మందుబాబులు పిచ్చిపిచ్చిగా  ప్రవర్తిస్తున్నా ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇక్కడ కొంత మంది  లాక్ డౌన్ నేపథ్యంలో మందు దొరకకపోవడంతో స్నేహితులు చెప్పిన చిట్కాలను ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయారు . ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తరచూ మద్యం తాగే అలవాటు ఉన్న వారు  గత కొన్ని రోజుల నుండి మద్యం దుకాణాలు తెరవకపోవడంతో పిచ్చెక్కిపోయారు... ఈ క్రమంలోనే స్నేహితులు కూడా సోడాలో  షేవింగ్ క్రీమ్ కలిపి తాగితే మత్తు వస్తుంది అని చెప్పడంతో ఒకసారి ట్రై చేసి ప్రాణాలు కోల్పోయారు . 

 

 

 చెన్నైలోని కొట్టాయి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో టాస్మాక్  దుకాణాలు కూడా మూతబడ్డాయి. దీంతో మందుబాబులు తీవ్రంగా ఒత్తిడికి లోనవుతున్నారు. పుదుకోట  జిల్లా కొట్టాయి  పట్టణానికి చెందిన అన్వర్,  రాజా స్నేహితులు. వీరిద్దరూ అరుణ్ పాండే,  ఆజాద్ మైదిన్ తో కలిసి తరచూ మద్యం తాగేవారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో దుకాణాలు మూత పడటంతో... వారికి మందు దొరకడం లేదు. దీంతో వారిపై తీవ్ర ఒత్తిడి పెరిగి పోయింది. కాగా సోడాలో  షేవింగ్ క్రీమ్ కలుపుకొని తాగితే మత్తు వస్తుందని కొంతమంది చెప్పడంతో... అప్పటికే  మందు కోసం అలమటిస్తున్న వారు అది నమ్మారు. వారు చెప్పినట్లు గానే సోడాలో  షేవింగ్ క్రీమ్ కలుపుకొని తాగారు . ఇక కాసేపటికే వారు స్పృహ కోల్పోవడంతో వారిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అరుణ్ పాండే అజాన్ మైదిన్ మృతి  చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: