తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా జిల్లాలకు, గ్రామాలకు వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే బాధితుల సంఖ్య 43కు చేరడంతో రాష్ట్రంలో 272 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారే అని సమాచారం. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో, ముందస్తు చర్యలు తీసుకోవడంలో, తరచూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో స్పూర్తి నింపడంలో సక్సెస్ అయ్యారు. 
 
రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సీఎం కేసీఆర్ ఢిల్లీ ప్రార్థనలకు హాజరై రాష్ట్రానికి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల నమూనాలు సేకరించి... వారిని క్వారంటైన్ కు తరలించి కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపట్టారు. అందువల్ల మరో రెండు రోజులు అధిక సంఖ్యలో కేసులు నమోదైనా ఆ తర్వాత కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. 
 
కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ చేస్తున్న కృషికి ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఏ సీఎం కష్టపడని స్థాయిలో సీఎం కేసీఆర్ కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కరోనాను కట్టడి చేయడానికి 5,000 కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పిన కేసీఆర్ నిరంతరం రాష్ట్రంలో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఖర్చుకు వెనుకాడకుండా కరోనాను నియంత్రించడానికి కృషి చేస్తున్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే కరోనా హాట్‌స్పాట్లను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే ప్రభుత్వం 25 హాట్‌స్పాట్లను గుర్తించగా వీటి సంఖ్య మరో 25 పెరగొచ్చని తెలుస్తోంది. హాట్‌స్పాట్ల పరిధిలో వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కరోనా లక్షణాలున్న వారిని గుర్తిస్తారు. 10వ తేదీ నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితం కావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కట్టడి కోసం కేసీఆర్ చేస్తున్న కృషికి ఇతర రాష్ట్రాల ప్రముఖుల నుంచి, ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కట్టడి కోసం కృషి చేస్తూ సీఎం కేసీఆర్ దేశ్ కీ నేత కేసీఆర్ అనిపించుకుంటున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: