వ్యక్తి బాగుపడితే సమాజం బాగుపడుతుంది.. సమాజం బాగుపడితే రాష్ట్రలు బాగుపడుతాయి.. రాష్ట్రాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది.. ఇదంతా జరగాలంటే ముందుగా ప్రతి మనిషిలో మార్పు రావాలి.. ఇది జరగని పని.. అయితే ఇది జరగనంత వరకు మనుషుల కష్టాలు తీరాలని ఆలోచించడం కూడా వ్యర్ధమే.. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. మన దేశంలో కరోనా పెరగవద్దంటే అందరు బాధ్యతతో వ్యవహరించాలి కానీ చాలావరకు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు..

 

 

దీని వల్ల తగ్గిపోతుందనుకున్న కరోనా మళ్లీ వింజృభిస్తుంది.. పరిస్దితి ఇలాగే కొనసాగితే.. పేదవారి కడుపులు కాలుతాయి.. ఆకలి చావులు పెరుగుతాయి.. ఇప్పటికే ఉద్యోగాల్లో కోతలు, జీతాల వెతలు ప్రారంభం అయ్యాయి.. ఇకముందు ముందు పరిస్దితులు చాలా కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ధనవంతులకు కడుపునిండా తిండికి లోటూ ఉండదు.. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని పేదవారి పరిస్దితి ఏంటని ప్రశ్నించుకుంటే.. దీనికి పరిష్కారం ఏ ప్రభుత్వం చూపిస్తుంది.. ఒకవేళ పేదవారికి మేలుచేయాలనుకున్న ఆ మేలు తాలూకు ఫలితం పేదవాడి గడప వరకు కూడా రాదు.. మధ్యలో ఎన్నో పందికొక్కులు కాచుక్కూర్చున్నాయి..

 

 

మొత్తానికి కరోనా వల్ల అర్ధం అయ్యేది ఏంటంటే ధనవంతుడు ఈ వ్యాధిని వ్యాపించినా.. గరీబోడు మాత్రం దీని హలా హలాన్ని భరించాలి.. మరి ఇంతటి కాలకూట విషాన్ని హరాయించుకో లేక ఎన్ని ప్రాణాలు రానున్న రోజుల్లో మట్టిలో కలిసిపోతాయే తెలియదు.. ఈ ప్రపంచంలో ఆకలికంటే పెద్ద శత్రువు మనిషికి ఏది ఉండదు.. ఈ ఆకలిముందు చావు కూడా మనిషిని భయపెట్టదు.. అందుకే ప్రభుత్వాలు ప్రణాళికతో రానున్న విపత్తును ఎదుర్కొని పేదలను ఒడ్దున పడవేస్తాయో లేక అసంతృప్తి పాలనలో ప్రజల ప్రాణాలను కాలానికి బలి చేస్తాయో చూడాలి..

 

 

ఇకపోతే ఇక్కడ లభించే జీవనోపాధికి తృప్తిపడక పొట్టకూటి కోసం జార్ఖండ్‌కు వలస వెళ్లిన కూలీలు కరోనా లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం గోసంపల్లెకు చెందిన గందం గంగన్న, గందం శ్రీనివాస్‌, లచ్చన్న, ఈబూది గంగన్న, ఎల్లవ్వలు నెల క్రితం జార్ఖండ్‌లోని రాంఘడ్‌ జిల్లా మదన్‌పూర్‌కు వెళ్లారు. లాక్‌డౌన్‌తో బువ్వలేక.. బయటపడే మార్గం కానరాక ఇబ్బందిపడ్డారు.

 

 

దీంతో తమను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు వాట్సాప్‌ సందేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.. ఒక వీరే కాదు ఎందరో బయటకు చెప్పుకోలేని ఇబ్బందులను పడుతున్నారు.. అందుకే ఈ సమయంలో అవినీతి ఆటకట్టించి దానికి తావులేకుండా ప్రభుత్వాలు పనిచేస్తే పేదవాడి కళ్లల్లో వెలుగు చూడవచ్చూ.. ప్రభుత్వం మీదకూడా సదాభిప్రాయం ఏర్పడుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: